రెండు రోజులుగా దీపావళి సంబరాల్లో సినీ సెలబ్రిటీలు మునిగితేలుతున్నారు. దివాళి మొత్తం తమలోనే దాగుందనేలా ముస్తాబై కనువిందు చేశారు. ఇక హీరోయిన్ల గురించి ఎంత చెప్పినా తక్కువే. వారి అందచందాలను కొత్త డ్రెస్సుల్లో బంధించి అభిమానులకు కనువిందునిచ్చారు. ఇక మెగాస్టార్‌, మెగా పవర్‌ స్టార్‌ సైతం దివాళి సెలబ్రేషన్‌లో పాల్గొన్నారు. 

ఆదివారం రాత్రి దివాళి పండుగ సందర్భంగా చిరంజీవి, రామ్‌చరణ్‌ సెల్ఫీలతో రెచ్చిపోయారు. ఇద్దరు ఒక్క చోట చేరి తమతోపాటు వెనకాల కాంతులను బంధించేందుకు తపించారు. పటాసుల పేలగా వచ్చే మిరుమిట్లు, కాంతులను సెల్ఫీలో బంధించేందుకు ప్రయత్నించారు. తమ ఇంటి మేడపైకి ఎక్కి మరీ వీరిద్దరు సెల్ఫీల కోసం ప్రయత్నించారు. ఈ సందర్బంగా తీసిన ఫోటోలను ఇన్‌ స్టాగ్రామ్‌ ద్వారా అటు మెగాస్టార్‌ చిరంజీవి, రామ్‌చరణ్‌ పంచుకున్నారు. చిరంజీవి `మా రాత్రి దివాళి రాత్రి` అని పోస్ట్ పెట్టగా, రామ్‌చరణ్‌ వెలుగులను బంధించేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. 

ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో సందడి చేస్తున్నాయి. మెగాస్టార్‌ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ గురించి తెలిసిందే. ఇక వారు ట్రెండ్‌ చేసే పనిలో బిజీ అయ్యారు. దీపావళి పండుగని తమ కుటుంబ సభ్యులతో సెలబ్రేట్‌ చేసుకున్న మెగాస్టార్‌ ఆదివారం ఇలా అభిమానులను కనువిందు చేశారు. 

ఇదిలా ఉంటే ఇటీవల చిరంజీవికి కరోనా పాజిటివ్‌ నిర్ణారణ అయి అందరిని షాక్‌కి గురి చేసిన విషయం తెలిసిందే. చిత్ర పరిశ్రమ వర్గాలే కాదు, యావత్‌ తెలంగాణ రాష్ట్రం ఉలిక్కి పడింది. ఆ తర్వాత టెస్ట్ చేసుకోగా, నెగటివ్‌ అని వచ్చింది. కరోనా టెస్ట్ కిట్‌ లోపం వల్లే ఇలా పాజిటివ్‌ వచ్చిందని తేల్చారు. అదే సమయంలో కిట్లల లోపాలను ఎత్తి చూపింది. ప్రస్తుతం చిరంజీవి `ఆచార్య` చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ ఇటీవలే ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇక రామ్‌చరణ్‌ `ఆర్‌ఆర్‌ఆర్‌`లో  నటిస్తున్నారు.