Asianet News TeluguAsianet News Telugu

రంగంలోకి దిగిన మెగాస్టార్, ఫ్రెష్ గా 154 మూవీ షెడ్యూల్ స్టార్ట్ చేసిన చిరు, ఎక్కడంటే...?

ఫ్రెష్ గా రంగంలోకి దిగాడు మెగాస్టార్ చిరంజీవి. ఆచార్య ప్లాన్ తో కాస్త స్లో అయిన తన ప్రాజెక్ట్స్ ను స్పీడ్ అప్ చేస్తున్నాడు. ఇందులో భాగంగానే.. తన 154 మూవీ తాజా షెడ్యూల్ ను స్టార్ట్ చేశాడు..? దూకుడు పెంచబోతున్నాడు మెగా హీరో.

Megastar Chiranjeevi 154 Movie Fresh Schedule Start
Author
First Published Sep 3, 2022, 9:06 AM IST

ఫ్రెష్ గా రంగంలోకి దిగాడు మెగాస్టార్ చిరంజీవి. ఆచార్య ప్లాన్ తో కాస్త స్లో అయిన తన ప్రాజెక్ట్స్ ను స్పీడ్ అప్ చేస్తున్నాడు. ఇందులో భాగంగానే.. తన 154 మూవీ తాజా షెడ్యూల్ ను స్టార్ట్ చేశాడు..? దూకుడు పెంచబోతున్నాడు మెగా హీరో.

సెకండ్ ఇన్నింగ్స్ లో జోరు పెంచిన మెగాస్టార్ చిరంజీవి..  వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే నాలుగైదు సినిమాలు లైన్ అప్ చేసుకున్నారు. రీసెంట్ గా ఆచార్య ప్లాప్ తో డిస్సపాయింట్ అయిన మెగాస్టార్.. ఇక నెక్ట్స్ సినిమాల విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. తన సినిమా డైరెక్టర్లందరిని అలెర్ట్ చేశాడు చిరంజీవి. ఇక వరుసగా తన సినిమాలు కంప్లీటే చేసే పనిలో పడ్డాడు. 

 చాలా తక్కువ గ్యాపులో మూడు ప్రాజెక్టులను పట్టాలెక్కించిన చిరంజీవి.. మరో రెండు సినిమాలను కూడా సెట్స్ ఎక్కించడానికి రెడీ అవుతున్నాడు. ఒకదాని తరువాత ఒకటిగా ఆయన ఆ ప్రాజెక్టులను పూర్తిచేస్తూ వస్తున్నారు.  ఇప్పటికే మోహన్ రాజా డైరెక్షన్ లో..మలయాళ లూసిఫర్ రీమేక్ గా తెరకెక్కుతోన్న గాడ్ ఫాదర్  సినిమా షూటింగ్ ముగింపు దశకి వచ్చేసింది.  ఇక నెక్ట్స్  బాబీ డైరెక్షన్ లో చేస్తున్న 154 సినిమా పై దృష్టి పెట్టారు చిరంజీవి. 

అంతే  స్పీడ్ తో బాబీ సినిమాను కూడా పూర్తి చేయాలనే పట్టుదలతో ఉన్నారు మెగాస్టార్.  ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో స్టార్ట్ అయ్యింది. ఆల్రెడీ  కొంతవరకూ జరిగింది కూడా. చాలా గ్యాప్ తీసుకున్న చిరంజీవి  తదుపరి షెడ్యూల్ ను హైదరాబాదులో ప్లాన్ చేశారు.ఇక  ఈ రోజు( 03 శనివారం) నుంచి తాజా షెడ్యూల్ ను హైదరాబాద్ లో స్టార్ట్ చేశారు. ఈ షూటింగ్ కు సంబంధించిన ఓ ఫోటోను ట్విట్టర్ లో పంచుకున్నారు డైరెక్టర్ బాబీ. 

 

 

ఇక ఈసినిమాలో మెగాస్టార్ జోడీగా శృతి హాసన్ నటిస్తోంది. ప్రస్తుతం ఈ షెడ్యూల్ లో చిరంజీవి .. శ్రుతి హాసన్ కాంబినేషన్ లోని కొన్ని కీలకమైన సన్నివేశాలను తెరకెక్కించబోతున్నట్టు సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్  నిర్మిస్తున్న ఈ సినిమాలో రవితేజ ఒక కీలకమైన పాత్రను పోషిస్తున్నాడు. ఈ సినిమాకి  ఇంకా టైటిల్ అనౌన్స్ చేయలేదు. వాల్తేర్ వీరయ్య అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు.

ఈ సినిమాతో పాటు  మెహర్ రమేష్ దర్శకత్వంలో  భోళాశంకర్ సినిమా చేస్తున్న చిరు.. అటు యంగ్ డైరెక్టర్ వెంకీ కుడుములతో కూడా ఒక సినిమాను అనౌన్స్ చేశాడు చిరంజీవి. ఈ సినిమాలతో టాలీవుడ్ లో సంచలనం సృష్టించబోతున్నాడు మెగాస్టార్. 

Follow Us:
Download App:
  • android
  • ios