రామ్ చరణ్ (Ram Charan) వరుస సినిమాలతో సందడి చేయనున్నారు. ఇప్పటికే రామ్ చరణ్ నటించిన ‘ఆర్ఆర్ఆర్’, ‘ఆచార్య’ మూవీలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. మరోవైపు ఆర్సీ15 కూడా రూపొందుతోంది. కాగా త్వరలో చరణ్ డిజిటల్ ఎంట్రీ కూడా ఇవ్వబోతున్నట్టు టాక్ నడుస్తోంది.    

మెగా‌పవర్ స్టార్ రామ్ చరణ్ తాజా చిత్రం ‘ఆర్.ఆర్.ఆర్’(RRR Movie) వచ్చేనెలలో ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్‌లో సందడి చేయబోతోంది. ఆపై నెలలో మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjivi), రామ్ చరణ్ నటించిన ‘ఆచార్య’ మూవీని విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రంలో చెర్రీ ‘సిద్ధ’గా ఓ ప్రత్యేక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే తన తదుపరి చిత్రం ‘ఆర్సీ 15’ని శంకర్ దర్వకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ యాక్షన్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. 

అలాగే.. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలోనూ ఒక సినిమాని కూడా కన్ఫర్మ్ చేశాడు రామ్ చరణ్. ఇది కాకుండా బాలీవుడ్ డైరెక్టర్లలు కూడా రామ్ చరణ్ ను సంప్రదిస్తున్నట్టు సమాచారం. ఇదీ గాక త్వరలో రామ్ చరణ్ డిజిటల్ ఎంట్రీ కూడా ఇవ్వబోతున్నట్టు టాక్ నడుస్తోంది. నెట్ ఫ్లిక్స్ (Netflix) కోసం చెర్రీ ఓ వెబ్ సిరీస్ ను చేయబోతున్నట్టు టాక్. అయితే సూపర్ హిట్ యూఎస్ఏ సిరీస్ ను రీమేక్ చేయబోతున్నారట. 

ఇప్పటికే నెట్ ఫ్లిక్స్ దక్షిణాది తారలతో డిజిటల్ కంటెంట్ ను రెడీ చేసే ప్రయత్నంలో ఉంది. అందులో భాగంగా చెర్రీతో వెబ్ సిరీస్ తెరకెక్కించబోతున్నారని తెలుస్తోంది. త్వరలోనే నెట్ ఫ్లిక్స్ టీమ్ రామ్ చరణ్ ను కలవబోతున్నది. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ త్వరలోనే రాబోతోంది. అన్నీ అనుకున్నట్టే జరిగితే.. ఈ ఏడాదే వెబ్ సిరీస్ సెట్స్ మీదకు వెళుతుందట. మరి డిజిటల్ రంగంలో చెర్రీ ఎంట్రీ ఏ రేంజ్ లో సక్సెస్ అవుతుందో చూడాలి.

Scroll to load tweet…

నెట్ ఫ్లిక్స్ రూపొందించబోతున్న ఈ వెబ్ సిరీస్ సక్సెస్ రేట్ అందుకుంటే చరణ్ పాన్-ఇండియా సూపర్‌ స్టార్‌డమ్‌ను పొందుతాడు. ఇప్పటికే రామ్ చరణ్ నటిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ మూవీ పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అవుతుండటంతో చరణ్ కు మంచి గుర్తింపు రానుంది. ఆ తర్వాత మొదలయ్యే ఈ వెబ్ సిరీస్ తో రామ్ చరణ్ ఎవరూ ఊహించని రేంజ్ కు వెళతాడు. 

మరోవైపు చరణ్ కూడా ఓటీటీ ప్రాజెక్ట్‌లో నటించేందుకు మొగ్గు చూపుతున్నట్టు పలువురు అభిప్రాయపడుతున్నారు. త్వరలో రామ్ చరణ్ ను కలవున్న నెట్ ఫ్లిక్స్ టీం విన్నింగ్ స్క్రిప్ట్‌తో కలిసి కచ్చితంగా ఆమోదం తెలపనున్నాడట రామ్ చరణ్.