మెగస్టార్ చిరంజీవికి అస్వస్థత.. ఆగిన ‘ఆచార్య’ షూటింగ్..!
మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై నిరంజన్ రెడ్డి, రామ్ చరణ్ దీన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. కరోనా తో సినిమా షూటింగ్ కు చాలా గ్యాప్ వచ్చింది. దాంతో కొరటాల శివ శరవేగంగా సినిమా ని పూర్తి చేసి రిలీజ్ కు రెడీ పెట్టాలనకుంటున్నారు.

అయితే ఊహించని విధంగా ప్రస్తుతం ఆచార్య సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి స్వల్ఫ అస్వస్థతకు గురైనట్టు తెలుస్తుంది. ఇల్లందు బొగ్గు గనుల్లో మూడు రోజులుగా ఆచార్య సినిమా క్లైమాక్స్ షూటింగ్ జరుగుతుంది. అయితే వేసవి ఇంకా పూర్తిస్థాయిలో మొదలవ్వక ముందే ఎండలు మండిపోతున్నాయి. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో రికార్డు స్థాయిలో ఊష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
దీంతో అక్కడే షూటింగ్ చేస్తున్న ఆచార్య టీంకు సమ్మర్ సెగలు తగిలాయి. అధిక వేడి కారణంగా చిరంజీవి డీహైడ్రేషన్‌కు గురయ్యారు. ఈ కారణంతో ఏడు రోజుల షెడ్యూల్‌తో షూటింగ్ జరుపుతుండగా, మూడ్రోజుల్లోనే షూటింగ్‌ను ముగించి చిత్ర యూనిట్ ప్యాకప్ చెప్పేసి హైదరాబాద్ రిటర్న్ అయ్యింది. అయితే పరిస్థితులు కాస్త చక్కబడిన తర్వాత మళ్లీ షూటింగ్ కొనసాగించబోతున్నట్లు టాక్.
ఆచార్య సినిమా ద్వారా తొలిసారిగా చిరంజీవి, రామ్ చరణ్ ఇద్దరూ కలిసి పూర్తి నిడివి కలిగిన పాత్రల్లో నటిస్తున్నారు. రామ్ చరణ్ ఆచార్య షూటింగ్ ముగించుకున్నాడు. 20 రోజుల పాటు జరిగిన ఆచార్య లేటెస్ట్ షెడ్యూల్లో రామ్ చరణ్, చిరంజీవిలపై కీలకమైన సన్నివేశాలు చిత్రీకరించారు. ఈ షెడ్యూల్‌తో రామ్ చరణ్‌కి సంబంధించిన షూటింగ్ పార్ట్ దాదాపు ముగిసినట్టేనని తెలుస్తోంది.
‘సైరా నరసింహా రెడ్డి’ తరువాత మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘ఆచార్య’ చిత్రంపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉన్న సంగతి తెలిసిందే. ప్రమఖ దర్శకుడు... కొరటాల శివ దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్స్ , మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై హీరో రామ్ చరణ్, నిరంజన్‌రెడ్డి ఈ చిత్రాన్ని అత్యంత భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో చిరంజీవి రెండు విభిన్నమైన పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది. సినిమాపైన భారీ అంచనాలు నెలకొన్నాయి.