Asianet News TeluguAsianet News Telugu

చిరంజీవిని ఏడిపించిన అఖిల్...హలో ప్రి రిలీజ్ లో వెల్లడించిన చిరు

  • అఖిల్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో వస్తోన్న హలో మూవీ
  • అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై తెరకెక్కిన ఈమూవీ ప్రి రిలీజ్ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి
  • శుక్రవారం విడుదలకు సిద్ధమైన హలో అన్ని వర్గాలను ఆకట్టుకుని సూపర్ హిట్ అవుతుందన్న చిరు
mega star chiranjeevi blessings to akhil in hello pre release event

హలో హైదరాబాద్... సింగ్ విత్ అఖిల్.. అంటూ హైదరాబాద్ ఎన్ కన్వెన్షన్ సెంటర్ లో నిర్వహించిన హలో మూవీ గ్రాండ్ ప్రి రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి వచ్చి అక్కినేని యంగ్ కింగ్ అఖిల్ ను ఆశీర్వదించారు. అక్కినేని అభిమానులు, ఇటు మెగా అభిమానుల కోలాహలంతో ప్రాంగణం అంతా సందడిగా మారింది. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ... అఖిల్ లాంటి కొడుకు మనకూ వుంటే బాగుండు కదా అనేదని, తమ ఇంటికి చరణ్ కోసం వచ్చినప్పుడల్లా... పలకరించి మంచి చెడు అడిగి తెలుసుకున్నప్పుడు తమకు మనసులో చెప్పలేని అనుభూతి కలుగుతుందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఈ మధ్య రామ్ చరణ్ ను అన్నయ్యా అని అప్యాయంగా పలకరించే అఖిల్, సోదరుడు నాగార్జున.. తమ సినిమా ఫంక్షన్ కు రావాలని అడిగితే రాకుండా ఉండగలమా. మా ఇంటికొచ్చినప్పుడు అఖిల్‌ మమ్మల్ని కలిశాకే చరణ్‌ను కలుస్తాడు. చరణ్‌, అఖిల్‌ మాట్లాడుకున్నప్పుడు చూసి సురేఖ మురిసిపోయేది. చరణ్‌కు తమ్ముడు లేడన్న లోటును అఖిల్‌ తీరుస్తున్నాడు అంటూ వ్యాఖ్యానించారు మెగాస్టార్.

 

ఇక హలో మూవీ గురించి మాట్లాడుతూ..  ‘‘హలో’కు అక్కినేని కుటుంబానికి అవినాభావ సంబంధం ఉంది. అప్పట్లో ఏఎన్నార్‌ హలో అంటూ పాట పాడగా.. తర్వాత నాగార్జున హలో బ్రదర్ అంటూ అలరించాడని, అమలతో హలో గురూ అంటూ యూత్ లో క్రేజ్  నింపాడని... ఇప్పుడు ‘హలో’ అంటూ అఖిల్‌ మన ముందుకు వస్తున్నాడు. ఇది కుటుంబ సభ్యుల ఫంక్షన్‌లా భావించి వచ్చా. ఈ కుటుంబంతో నాకున్న అనుబంధం అలాంటిది. ‘హలో’ టైటిల్‌ పెట్టిన వారికి ముందుగా హ్యాట్సాఫ్‌. ‘హలో హలో అమ్మాయి’ అంటూ అప్పట్లో ఏఎన్నార్‌ గారు.. ‘హలో గురూ అంటూ’ నాగార్జున, అమల.. ఇప్పుడు ‘హలో’తో అఖిల్‌ రాబోతున్నాడు. ఇలా ‘హలో’కు ఎప్పుడో ఈ కుటుంబానికి బంధం ఏర్పడిపోయింది.’’

 

‘‘రిలీజ్‌కు ముందు ఈ సినిమా చూశా. ఫెంటాస్టిక్‌ లవ్‌స్టోరీ. మొదటి నుంచి చివరి వరకు సినిమాను చాలా చక్కగా తీసుకెళ్లారు విక్రమ్‌ కుమార్‌. ‘మనం’లాగానే దీన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దాడు. కేవలం యూత్‌కే కాదు.. అందరికీ ఈ సినిమా నచ్చుతుంది. ఈ చిత్రంలో యాక్షన్‌, చేజస్‌, విన్యాసాలు కొత్తగా ఉన్నాయి. మొత్తంగా ఈ సినిమా ఆల్‌ క్లాస్‌ సినిమా. అఖిల్‌ డ్యాన్స్‌ ఇరగదీశాడు. ఆ టాలెంట్‌ చూసి ఆశ్చర్యపోయా. ఈ సినిమాతో అఖిల్‌ మరో మెట్టుకు ఎదిగిపోయాడు. ఈ సినిమా చూసి బయటకొచ్చిన తర్వాత కన్నీరు ఆగలేదు. ప్రతి ఒక్కరి గుండెల్ని ఈ సినిమా తాకుతుంది.

 

తాత, నాన్న, అన్నను మించిన నటుడు అఖిల్‌. హీరోయిన్‌ కల్యాణి కూడా బాగా నటించింది. ఆమె నా కుటుంబ సభ్యురాలు లాంటిది. కుర్రవాళ్లను కల్యాణి తప్పక ఆకర్షిస్తుంది. రమ్యకృష్ణ, జగపతిబాబు వంటి గొప్ప నటులు ఇందులో నటించారు. అనూప్‌ మంచి మెలోడీలు ఇచ్చారు ఈ సినిమా మంచి విజయం సాధిస్తుంది. మళ్లీ ఈ సినిమా విజయోత్సవానికి వస్తా’’ అన్నారు.

 

నాగార్జున మాట్లాడుతూ.. ‘‘ఇవాళ నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా హీరో విక్రమ్‌ కుమార్‌ గురించే ముందు చెప్పాలి. అప్పుడు ‘మనం’.. ఇప్పుడు ‘హలో’తో మరో మంచి సినిమా ఇచ్చారు. మిగతా టెక్నీషియన్లు బాగా పనిచేశారు. చిరంజీవి గారి ఇంటికెళ్లి అఖిల్‌ను ఆశీర్వదించాలని కోరగానే వస్తానన్నారు. సినిమా చూసిన తర్వాతే రండి అని ఆహ్వానించా. ఇవాళే ఆయన ఈ సినిమా చూశారు. దీని గురించి ఆయనే చెబుతారు. రామ్‌చరణ్‌.. అఖిల్‌ కంటే వయసులో పెద్ద. చిరంజీవి గారు నాకంటే పెద్దవారు. వాళ్లిద్దరూ ఎప్పుడు ఫ్రెండ్స్‌ అయ్యారో తెలీదు. సమంత వచ్చిన తర్వాత ఇళ్లు కళకళలాడుతోంది. చైతన్యకున్న మంచి మనసు నాకు కూడా లేదు. అఖిల్‌ను చూస్తూ ఉంటే కడుపు నిండిపోయింద’’న్నారు.

 

రామ్‌చరణ్‌ మాట్లాడుతూ.. ‘‘నాన్న గారు ఈ సినిమా చూశారు. ఇవాళ లంచ్‌ బ్రేక్‌లో ఈ సినిమా గురించే నాతో మాట్లాడారు. సినిమా చూశాక మీలా నేను ఎంజాయ్‌ చేస్తా. పెద్ద టెక్నీషియన్స్‌ పనిచేసిన ఈ సినిమా తప్పక హిట్‌ అవుతుంద’’న్నారు.

 

నాగచైతన్య మాట్లాడుతూ ‘‘అఖిల్‌ డ్యాన్స్‌ బాగా చేస్తాడు.. ఫైట్లు బాగా చేస్తాడు. కానీ, మంచి ఫీల్‌గుడ్‌ మూవీలో చూడాలనుకున్నా. ఈ సినిమాతో ఆ కోరిక తీరిపోయింది. ఈ సినిమా చూశాక మీకూ ఆ విషయం తెలుస్తుంద’’న్నారు. సమంత మాట్లాడుతూ ‘‘ఈ సినిమా టీజర్‌, ట్రైలర్‌ చూస్తే నిజమైన అఖిల్‌ కనిపిస్తున్నాడు. మా మధ్య ఉన్న నిజమైన అఖిల్‌ను తెరపైకి చూపిస్తున్నందుకు దర్శకుడు విక్రమ్‌కు ధన్యవాదాలు. ఈ సినిమా పెద్ద హిట్‌ అవుతుందని’’ అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios