వరుస ప్లాప్ లతో ఆలోచనలో పడ్డ వరుణ్ తేజ్, నెక్ట్స్ సినిమాలపై మెగా ప్రిన్స్ దృష్టి

వరుస ప్లాప్ లు ఎదురవుతుండటంతో.....మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆలోచనలో పడ్డాడు. నెక్ట్స్ సినిమాల విషయంలో ఓ నిర్ణయం కూడా తీసేసుకున్నాడట. ఇంతకీ మెగా హీరో ఏం చేయబోతున్నాడు.  

Mega Prince Varun Tej Next Movie Plans

హీరోగా  స్టార్ డమ్ కోసం చాలా కలలు కన్నాడు వరుణ్ తేజ్.  మెగా ఇమేజ్ ఉన్నా.. తనకంటూ సక్సెస్ ఫుల్ సినిమా జర్నీ ఉంటేనే  ఏ గ్రేడ్ స్టార్ గా ప్రమోషన్ సాధించవచ్చు. అందుకోసమే చాలా కష్టపడ్డాడు. వరుసగా సినిమాలు చేశాడు. ప్రయోగాలకు పెద్ద పీట వేశాడు. 2019 లో గద్దలకొండ గణేష్ సూపర్ డూపర్ హిట్ తరువాత  లాంగ్ గ్యాప్ తీసుకున్నాడు వరుణ్ తేజ్. అది కరోనా వల్ల అవ్వచ్చు, మంచి సినిమా ఇవ్వలి అన్న ఆలోచన అవ్వచ్చు.. ఇక లాంగ్ గ్యాప్ తరువాత బాక్సార్ అవతారంలో తన కష్టాన్నంతా గని సినిమాపై పెట్టాడు. 

గని  సినిమా ఊహించని విధంగా డిజాస్టర్ అయ్యింది. అసలు రిలీజ్ అయిన సంగతే ఎవరికి తెలియలేదు. ఇంతకుముందు రెండు హిట్లు ఇచ్చి ఉన్న వరుణ్ తేజ్, గనితో హ్యాట్రిక్ హిట్ కొడతాడని అనుకున్నారు. కానీ ఆ సినిమా ఫలితం నిరాశ పరిచింది.ఆ తరువాత వరుణ్ తేజ్ నుంచి వచ్చిన ఎఫ్ 3 కూడా ఆశించినస్థాయి విజయాన్ని అందుకోలేకపోయింది. నవ్వుల సందడి చేస్తుందనుకున్న ఈ సినిమా హడావిడి మాత్రమే చేసింది. 

దాంతో  ఇప్పుడు వరుణ్ తేజ్  ఆలోచనలో పడ్డాడనే టాక్ వినిపిస్తోంది. తన నెక్స్ట్ సినిమా విషయంలో ఆయన అన్ని రకాలుగా ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. గని తరువాత ప్రవీణ్ సత్తారుతో వరుణ్ తేజ్ సినిమా చేస్తాడని అన్నారు. అయితే ఆయనతో  చేయాలనుకున్న ప్రాజెక్టును వరుణ్ తేజ్ హోల్డ్ లో పెట్టాడని అంటున్నారు. 

ప్రవీణ్ సత్తారు నాగార్జునతో  ది ఘోస్ట్ మూవీని తెరకెక్కిస్తున్నారు. త్వరలో ఈ సినిమ రిలీజ్ కాబోతోంది. ఆ సినిమా రిజల్ట్ ను చూసిన తరువాత తన సినిమాపై నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నాడట. ప్రస్తుతం మెగా ప్రిన్స్ కథలు వినడంలో బిజీగా ఉన్నాడని సమాచారం. ఈ సారి ఆచితూచి అడుగు వేయాలనకుంటున్నాడు యంగ్ స్టార్.. మరి వరుణ్ తేజ్ ఈ సారి ఏం చేస్తాడో చూడాలి. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios