ప్రపంచ వ్యాప్తంగా మ్యూజిక్ లవర్స్ చేత స్టెప్పులేపిస్తుంది నాటు నాటు పాట. ఒక తెలుగు సినిమా పాట ప్రపంచం దృష్టిని ఇంతలా ఆకర్షిస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. అంతే కాదు ప్రస్తుతం ఆస్కార్ కు అతి చేరువలో ఉందీ పాట. ఈ పాట గురించి మరిన్ని విషయాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.
ఆస్కార్ ప్రమోషన్స్ లో భాగంగా ఆర్ఆర్ఆర్ టీమ్ అమెరికాలో సందడి చేస్తున్నారు. రాజమౌళితో పాటు రామ్ చరణ్, కీరవాణి, సెంథిల్ కుమార్ అక్కడే ఉండి ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. ఇక రీసెంట్ గా ఎన్టీఆర్ కూడా వీరితో కలిసి జాయిన్ అయ్యారు. వెళ్ళీ వెళ్ళడంతోనే తన మార్క్ ప్రచారం స్టార్ట్ చేశారు తారక్. ఇక ఇంతకు ముందు నుంచే అమెరికాలో బిజీ బిజీగా గడిపిన రామ్ చరణ్ .. అక్కడ ప్రముఖ మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు. ప్రస్తుతం ఎన్టీఆర్ కూడా వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీ అయిపోయారు.
ఇక ఈక్రమంలో నాటు నాటు పాట గురించి...దానికోసం తాము పడ్డ కష్టం గురించి వివరించారు చరణ్. తాజాగా ఎంటర్‌టైన్‌మెంట్ టునైట్ అనే ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నాటు నాటు సాంగ్ గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా చరణ్ మాట్లాడుతూ.. ఇప్పుడు నాటు నాటు పాట మాది మాత్రమే కాదు ప్రపంచంలోని ప్రేక్షకులందరిది. ఆ పాట లిరిక్స్ అర్ధం అవ్వకపోయినా..పాట ట్యూన్ ను బీట్ ను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మ్యూజిక్ లవర్స్ ను బాగా అలరిస్తుంది ఈ పాట. అంతే కాదు డాన్స్ కూడా బాగా ఇష్టపడుతున్నారు. చాలా మంది ఈ పాటను.. డాన్స్ ను అనుకరించడం ఆనందంగా ఉంది అన్నారు చరణ్.
జపాన్ నుంచి అమెరికా వరకు అందరూ నాటు నాటు పాటకు స్టెప్పులు వేశారు. ఇంతకు మించిన గౌరవం తమకు ఏం ఉంటుంది అన్నారు చరణ్. ఇక ఈ పాట షూటింగ్ విశేషాలు కూడా పంచుకున్నారు చరణ్. ఉక్రెయిన్ అధ్యక్ష భవనం ముందు ఈ పాటని షూట్ చేశాం. ఆ దేశాధ్యక్షుడు జెలెన్ స్కీ కూడా ఒకప్పుడు నటుడు కావడంతో షూటింగ్ కి తొందరగా పర్మిషన్ వచ్చిందన్నారు. ఈ పాట కోసం దాదాపు 150 మంది డ్యాన్సర్లు... 200 మంది టెక్నీషియన్స్ పనిచేశారు. ఈ పాటని షూట్ చేయడానికి దాదాపు 17 రోజులు టైమ్ పట్టింది అన్నారు.
అంతే కాదు ఈ పాటలో ఎన్టీఆర్ తో కలిసి తను చేయాల్సిన కొన్ని స్టెప్పులు కరెక్ట్ గా సింక్ చేయడం కోసం చాలా టేక్స్ తీసుకున్నాం అన్నారు రామ్ చరణ్. ఈ పాట కోసం ఎంత కష్టపడ్డామంటే.. నాటు నాటు పాట పూర్తయ్యే సరికి కి నేను నాలుగు కిలోల బరువు తగ్గాను అని అన్నారు చరణ్. అది తలుచుకుంటే ఇప్పటికి కూడా నా కాళ్ళు వణుకుతాయి అని అన్నారు. ఇక ఈనెల 12న ఆస్కార్ వేడుకలు జరగబోతున్నాయి. డిస్నీ హాట్ స్టార్ లో.. ఇండియన్ టైమ్ ప్రకారం 13 ఉదయం 5 నుంచి ప్రోగ్రామ్ లైవ్ టెలికాస్ట్ కాబోతోంది. ఇక నాటు నాటు సాంగ్ ఆస్కార్ గెలవాలని అభిమానలు కోరకుంటున్నారు. కొంత మంది పూజలు చేస్తున్నారు.
