టాలీవుడ్‌లో బెస్ట్‌ కపుల్‌గా పేరు తెచ్చుకుంటున్న జంట రామ్‌ చరణ్‌, ఉపాసన. వీరిద్దరూ పెళ్లి చేసుకొని 8 ఏళ్లు అవుతున్నా ఇప్పటికీ కొత్త జంటలా కనిపిస్తారు. తమ లైఫ్‌లో ప్రతీ చిన్న ఇన్సిడెంట్‌ను అభిమానులతో పంచుకునే చెర్రీ, ఉపాసనలు అభిమానులకు ఎప్పటికప్పుడూ అప్‌డేట్స్‌ ఇస్తుంటారు. ఈ రోజు ఉపాసన పుట్టిన రోజు సందర్భంగా తన ప్రేమ వ్యక్తపరుస్తూనే ఉపాసన వ్యక్తిత్వం గురించి ఆసక్తికర పోస్ట్ చేశాడు రామ్‌ చరణ్‌.

పూల గుత్తుల మధ్య ఉన్న ఉపాసన ఫోటోను పోస్ట్ చేసిన చెర్రీ.. ఆమె చేసే సేవా కార్యక్రమాల గురించి కామెంట్ చేశాడు. `నువ్వు జాలి చూపిస్తూ చేసే ప్రతీ చిన్న పని వృదా కాదు. నువ్వు ఈ కార్యక్రమాలు కొనసాగిస్తావని ఆశిస్తున్నా. నీకు ప్రశంసలు కూడా ఇలాగే వస్తుంటాయని ఆశిస్తున్నా. పుట్టిన రోజు శుభాకాంక్షలు` అంటూ కామెంట చేశాడు చరణ్‌.

ఇక సినిమాల విషయానికి వస్తే చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ ఆర్ ఆర్‌ సినిమాలో నటిస్తున్నాడు. పీరియాడిక్‌ ఫాంటసీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్‌ చరణ్, అల్లూరి సీతారామ రాజు పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే మేజర్‌ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా లాక్‌ డౌన్‌ కారణంగా ఆగిపోయింది. నటుడిగానే కాదు నిర్మాతగానూ దూసుకుపోతున్నాడు చెర్రీ. ప్రస్తుతం తండ్రి చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమాను రూపొందిస్తున్నాడు.