Asianet News TeluguAsianet News Telugu
breaking news image

రామ్ చరణ్ గ్యారేజ్ లో మరో లగ్జరీ కారు.. మెగా పవర్ స్టార్ దగ్గర ఎన్ని కార్లున్నాయి.. వాటి కాస్ట్ ఎంత..?

మెగా పవర్ స్టార్.. గ్లోబల్ హీరో రామ్ చరణ్ గ్యారేజ్ లోకి కొత్త కారు వచ్చి చేరింది. కొత్త కారు మాత్రమే కాదు హైదరాబాద్ లో మొట్ట మొదటి కారు..లగ్జరీ.. కాస్ట్లీ కారు కూడా..? ఇంతకీ చరణ్ కొన్న కారు కాస్ట్ ఎంతో తెలుసా..? ఆయన దగ్గర ఎన్నికార్లు ఉన్నాయి. వాటి కాస్ట్ ఎంత..? 

Mega Power Star Ram Charan Car Collection and cost Details JMS
Author
First Published Jul 11, 2024, 5:56 PM IST

టాలీవుడ్ తో పాటు.. బాలీవుడ్, హాలీవుడ్ స్థాయికి కూడా వెళ్ళాడు మెగా పవర్ స్టార్  రామ్ చరణ్. ఆయన గురించి ప్రత్యేుకంగా చెప్పాల్సిన పనిలేదు. మెగా వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చినా.. సొంత ఇమేజ్ తో ఎదిగాడు. తనకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ ను ఏర్పాటు చేసుకున్నాడు రామ్ చరణ్. పాన్ వరల్డ్ స్థాయిలో  రామ్ చరణ్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. తండ్రి మెగాస్టార్ కుమారుడిగా ఆయన పేరు నిలబెట్టడంతో పాటు.. మెగా ఇమేజ్ ను రెట్టింపు చేసిన హీరో రామ్ చరణ్. 

ఆర్ఆర్ఆర్ తో హాలీవుడ్ డైరెక్టర్ల చేత కూడా శభాష్ అనిపించుకున్నాడు రామ్ చరణ్. ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా సినిమాలతో దూసుకుపోతున్న మెగా పవర్ స్టార్ కు పర్సనల్ లైఫ్ లో కోన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయి. ఆయనకు గుర్రపు స్వారి అంటే చాలా ఇష్టం. అంతే కాదు లగ్జరీ కార్లంటే ఎంతో మోజు.. ఇష్టమైన కారు ముచ్చటపడ్డాడంటే.. అది ఆయన గ్యారేజ్ లో ఉండాల్సిందే. కార్ కలెక్షన్ అంటే చరణ్ కు ఎంతో ఇష్టం.  హై-ఎండ్ వాహనాలను కలెక్షన్ చేస్తుంటాడు చెర్రీ. ఇప్పుడు, రామ్ చరణ్ తన కలెక్షన్‌కి కొత్త కారును జోడించాడు

శ్రీకాంత్ కు అంత బ్యాడ్ టైమ్ నడిచిందా..? అన్ని ఇబ్బందులు పడ్డారా..?

రీసెంట్ గా రామ్ చరణ్ కొత్త కారు కొన్నాడు.  బ్లాక్ రోల్స్ రాయిస్ స్పెక్టర్ కారు ఆయన గ్యారేజ్ లో వచ్చి చేరింది. దీని విలువ దాదాపు  7.5 కోట్లు ఉంటుందని అంచనా. అంతే కాదు  హైదరాబాద్‌లో తొలి రోల్స్ రాయిస్ స్పెక్టర్ ఇది కావడంతో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ కారు గతేడాది జనవరిలో ఇండియాలో  లాంచ్  అయ్యింది. 

గురువారం ఉదయం హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయానికి రామ్ చరణ్ , అతని భార్య ఉపాసన ఈ కొత్త కారులో వచ్చారు. జూలై 12న ముంబైలో జరగనున్న అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహానికి వారు వెళ్తున్నారు. అయితే అక్కడ కొత్త కారులో దిగిన రామ్ చరణ్‌ను చూసిన కెమెరా కళ్లు క్లిక్కుమనిపించామి. 

ఇద్దరు హీరోలతో ఎఫైర్.. ఎంగేజ్మెంట్ క్యాన్సిల్, 40 ఏళ్లు దాటినా పెళ్లి చేసుకోకుండా సోలోగా ఉన్న స్టార్ హీరోయిన్

అయితే  రామ్ చరణ్ గ్యారేజ్ లో ఇంకా కాస్ట్లీ కార్లు చాలా ఉన్నాయి అవి ఏంటి.. వాటి విలువ ఎంత అంటే..? 

మెర్సిడెస్ మేబ్యాక్ GLS 600 — రూ. 4 కోట్లు

ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ V8 — రూ. 3.2 కోట్లు

ఫెరారీ పోర్టోఫినో - రూ 3.50 కోట్లు

రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ - రూ 2.75 కోట్లు

BMW 7 సిరీస్ — రూ. 1.75 కోట్లు

 

ప్రస్తుతం శంకర్ డైరెక్షన్ లో గేమ్ ఛేంజర్ మూవీ చేస్తున్నాడు రామ్ చరణ్. ఈ సినిమా తరువాత బుచ్చిబాబు తో సెట్స్ పైకి వెళ్లనున్నాడు. ఈసినిమాలో జాన్వీ కపూర్ హీరోయన్ గా నటిస్తోంది. శంకర్ గేమ్ ఛేంజర్ రిలీజ్ కోసం ప్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. త్వరలో ఈ సినిమా నుంచి వరుసగా అప్ డేట్స్  స్టార్ట్ కాబోతున్నట్టు తెలుస్తోంది. 

దావూద్ ఇబ్రహ్రీంను ప్రాణంగా ప్రేమించిన బాలీవుడ్ హీరోయిన్లు, ఈ అండర్ వరల్డ్ డాన్ అంటే అంత ఇష్టమా..?

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios