రీసెంట్ గా సూళ్లూరు పేటలో 'వి ఎపిక్' పేరుతో మల్టీప్లెక్స్ ని రామ్ చరణ్ లాంచ్ చేసిన విషయం తెలిసిందే. యూవీ ప్రొడక్షన్ తో కలిసి ప్రభాస్ మల్టిప్లెక్స్ బిజినెస్ స్టార్ట్ చేశాడు. అయితే స్పెషల్ గెస్ట్ గా మల్టిప్లెక్స్ లాంచ్ ఈవెంట్ లో పాల్గొన్న రామ్ చరణ్ సైరా - సాహో సినిమాల గురించి మాట్లాడారు. 

సాహో మంచి విజయం సాధించాలని కోరుకున్న రామ్ చరణ్ అభిమానుల వినతి మేరకు ఒక హామీ ఇచ్చాడు. తప్పకుండా ఈ మల్టిప్లెక్స్ కి సైరా సినిమా రిలీజ్ అవ్వగానే మెగాస్టార్ చిరంజీవి గారిని తీసుకు వస్తానని అప్పుడు మీరందరు ఆయనతో కలిసి సినిమా చూడవచ్చని చెప్పారు. ఇక మల్టిప్లెక్స్ లాంచ్ అవ్వగానే మొదట సైరా టీజర్ ని అలాగే సాహో ట్రైలర్ ని ప్రదర్శించారు. 

థియేటర్ ని టెక్నీకల్ వాల్యూస్ తో యూవీ క్రియేషన్స్ సినిమాను అద్భుతంగా నిర్మించిందని రామ్ చరణ్ తన వివరణ ఇచ్చాడు. దర్శకుడు సుజిత్ అలాగే మరికొంత మంది సినీ ప్రముఖులు ఈవెంట్ లో పాల్గొన్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ చరణ్ నిర్మించిన సైరా సినిమా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.