మెగా ప్యాన్స్ కు పెద్ద సర్ ప్రైజ్.. అభిమానులకు పండగలాంటి న్యూస్.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన సూపర్ హిట్ మూవీ మగధీర రీరిలీజ్ కు సన్నాహాలుజరుగుతున్నాయి.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్ ను మలుపు తిప్పిన సినిమా మగధీర. ఈమూవీ రామ్ చరణ్ కు స్టార్ హీరో ఇమేజ్ ను తెచ్చి పెట్టింది. ,ఎన్నో రికార్డ్స్ సాధించిన ఈసినిమాను రీరిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. మెగా పవర్ స్టార్ బర్త్ డే సందర్భంగా బ్లాక్ బస్టర్ మూవీని రీ రిలీజ్ చేయబోతున్నట్టు గీతాఆర్ట్స్ వారుఅధికారికంగా ప్రకటించారు.
మగధీర రీ రిలీజ్ అంటూ.. గత కొన్నాళ్ల నుంచి సోషల్ మీడియాలో టాక్ నడుస్తున్నప్పటికీ.. అధికారికంగా ఎవరూ మాట్లాడలేదు. ఇక ఈసినిమా పై మెగా అభిమానులు ఎదురు చూస్తున్నట్టుగా అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చేసింది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే కానుకగా మార్చ్ 27కి రిలీజ్ చేస్తున్నట్టుగా నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ ప్రకటించారు తమ సోషల్ మీడియా పేజ్ లో ఈ ప్రకటన ఇచ్చారు. దీనితో ఈ అప్డేట్ ఇప్పుడు వైరల్ గా మారింది.
చిరుత సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్.. మగధీర సినిమాతోనే కెరీర్ లో సాలిడ్ హిట్ కొట్టారు. ఈసినిమాతో మెగా వపర్ స్టార్ గా మారిన రామ్ చరణ్.. సొంత టాలెంట్ తో ఎదిగారు. మొదట్లో కాస్త విమర్షలు ఎదుర్కోన్నా.. తనను తాను మార్చుకుంటూ.. కెరీర్ ను మలుచుకున్నారు. తన రెండవ సినిమా మగధీర తో తెలుగు సినీ పరిశ్రమలో ఒక కొత్త చరిత్రను లిఖించాడు చరణ్.
13 ఏళ్ల క్రితమే కనీవినీ ఎరుగని విధంగా భారీ బడ్జెట్ తో.. మగధీర సినిమాను నిర్మించి సాహసం చేశారు గీతా ఆర్ట్స్. అప్పట్లోనే పాన్ఇండియా సినిమాలకు ధీటుగా అతి పెద్ద సాహసానికి బాటలు వేసింది గీతా ఆర్ట్స్ సంస్థ. మెగా ప్రొడ్యూసర్అల్లు అరవింద్ భారీ బడ్జెట్ తో ఈసినిమాను నిర్మించగా.. మగధీర సినిమా దానికి మూడింతలు వసూలు చేసింది. పాన్ ఇండియా సినిమాకు ఉండాల్సిన కంటెంట్ అంతా పుష్కలంగా ఉన్న సినిమా మగధీర.
దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాలోని కాలభైరవ గా రామ్ చరణ్ , మిత్రబింద గా కాజల్ పాత్రలు ఆడియన్స్ మనసుల్లో అలా నిలిచిపోయాయి. ఈ పాత్రలతో ఇప్పటికీ ఇతరసినిమాల్లో కామెడీ సీన్స్ చేస్తూనే ఉంటాం. ఇక సోషల్ మీడియాలో ఎన్ని మీమ్స్ వచ్చాయో లేక్కే లేదు. కేమగధీర సినిమా మళ్ళీ ఇప్పుడొస్తే ఆ ఊహే అద్భుతంగా ఉంది కదా, అదే జరగబోతుంది. మార్చ్ 27 న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాను రీ రిలీజ్ చెయ్యబోతున్నారు. ఈ సినిమాను నిర్మించిన గీతా ఆర్ట్స్ నిర్మాణ సంస్థ ఈ సినిమాను రీ రిలీజ్ చేయనుంది. అప్పుడు ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ అనిపించుకున్న మగధీర" చిత్రం మరోమారు ప్రకంపనలు సృష్టించడానికి సిద్దమవుతుంది.
