Asianet News TeluguAsianet News Telugu

అది మెగా స్టైల్ అయితే.. ఇది నందమూరి స్టైల్

  • గౌతమి పుత్ర శాతకర్ణి చిత్ర ప్రమోషన్ లో ఎక్కడా కనిపించని అబ్బాయిలు
  • బాబాయి చిత్రం సక్సెస్ కావాలంటూ కేవలం ట్వీట్లతో సరిపెట్టిన అబ్బాయిలు
  • మెగా ఈవెంట్ లో పవన్ తప్ప మెగా హీరోలు అందరూ హాజరు
mega nandamuri heroes difference

గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా రిలీజ్ సందర్భంగా నందమూరి ఫ్యామిలీ విబేధాలు మరోసారి బయటపడ్డాయా అంటే అవుననే అంటున్నాయి తాజా పరిణామాలు. సంక్రాంతికి ఇటు శాతకర్ణి, అటు మెగా స్టార్ ఖైదీ నెంబర్ 150 సినిమాలు పోటాపోటీగా రిలీజైన సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాలకూ ప్రమోషన్ కూడా ఏమాత్రం తగ్గకుండా ఒక రేంజ్ లో చేస్తున్నారు. 

 

అయితే ప్రమోషన్స్ ఎంత చేసినా ఫ్యామిలీ హీరోలంతా సపోర్ట్ చేస్తే...ఆ కిక్కే వేరు. మెగా స్టార్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రాని పవన్ ట్వీట్ తో అన్నయ్యకు శుభాకంక్షలు తెలిపాడు. ఇక అదే బాటలో బాబాయ్ బాలయ్యకు విషెష్ చెప్పారు అబ్బాయిలు కల్యాణ్ రామ్, తారక్ లు. బాబాయ్ వందో సినిమా విడుదల సందర్భంగా కేవలం ట్విటర్ ద్వారా మాత్రమే స్పందించారు. సినిమా విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఈ సినిమా బాలకృష్ణ కెరీర్ లో మైలు రాయి అవుతుందని కల్యాణ్ రామ్ ఆకాంక్షించాడు. ‘ల్యాండ్ మార్క్ ఫర్ ద లెజెండ్..’ అంటూ ఈ హీరో ట్వీట్ చేశాడు. సినిమా యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపాడు.

ఇక బాబాయ్ కి, ఈ సినిమా యూనిట్ కు దర్శకుడు క్రిష్ కు శుభాకాంక్షలు తెలుపుతూ, ఆల్ ద బెస్ట్ చెప్పాడు ఎన్టీఆర్. ఈ హీరో ఈ మేరకు ట్వీట్ చేశాడు. మరి బాబాయ్ కి, అబ్బాయిలకు ప్రస్తుతం సంబంధాలు అంతంత మాత్రంగా ఉన్నాయన్న ఊహాగానాల నడుమ వీరు కేవలం ట్వీట్లతో సరిపెట్టడం గమనార్హం. మెగా హీరోలంతా మెగా స్టార్ చిరంజీవి మూవీ ప్రమోషన్ కోసం థియేటర్లకు, ఈవెంట్స్ కు స్వయంగా అటెండ్ అవుతూ ఉత్సాహం నింపుతున్న సంగతి తెలిసిందే.

మెగా హీరోలు మెగాస్టార్ కోసం తెగ ప్రమోషన్ చేస్తుంటే.. నందమూరి హీరోలు మాత్రం ట్వీట్లతోనే సరిపెట్టారనే విమర్శ సర్వత్రా వినిపిస్తోంది. ట్వీట్లంటే అందరూ పెట్టేవేగా! ఇప్పటికే దర్శక దిగ్గజాలెెందరో ఈ రెండు సినిమాల విజయటం కాంక్షిస్తూ ట్వీట్లే ట్వీట్లు చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios