Asianet News TeluguAsianet News Telugu

పాన్ ఇండియా సినిమా కోసం మెగా ప్రిన్స్ తంటాలు.. జిమ్ములో వరుణ్ తేజ్ కసరత్తులు షురూ.

రీసెంట్‌గా గాంఢీవదారి అర్జున సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు మెగా ప్రిన్స్ వరుణ్‌ తేజ్‌.. కాని ఈసినిమాతో ప్రేక్షకులను మెప్పించలేకపోయాడు. 

Mega Hero Varun Tej Workout Photo Viral In Social Media JMS
Author
First Published Sep 1, 2023, 4:03 PM IST | Last Updated Sep 1, 2023, 4:03 PM IST

పాపం వరుణ్ తేజ్ (Varun Tej) ఎన్ని ప్రయత్నాలు చేసినా... సాలిడ్ హిట్ మాత్రం దొరకడంలేదు. గద్దలకొండ గణేష్ తరువాత.. ఎన్ని ప్రయోగాలు చేసినా.. ఎన్ని డిఫరెంట్ కాన్పెప్ప్ట్ లు తీసుకున్నా.. సక్సెస్ మాత్రం దరిచేరడంలేదు. రీసెంట్‌గా గాంఢీవదారి అర్జున సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు వరుణ్‌ తేజ్‌ (Varun Tej). ఈ  సినిమా రిలీజ్ అయ్యింది కూడా ఎవరికీ తెలియలేదు. ఇక అంతకుముందు కూడా గని సినిమా కోసం చాలా కష్టపడ్డాడు వరుణ్ తేజ్. సిక్స ప్యాక్ తో అదరగొట్టాడు. ఫారెన్ లో స్పెషల్ గా బాక్సీంగ్ నేర్చుకున్నాడు.  కాని ఈసినిమా కోసం అంత కష్టపడ్డా కాని.. గని రిలీజ్ అయిన సంగతి కూడా ఎవరికీ తెలియలేదంటే.. మూవీ బాక్సాఫీస్‌ వద్ద ఎలా డీలా పడిపోయిందో అర్ధం అవుతోంది. 

ఇక  ప్రస్తుతం వార్‌ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఆపరేషన్‌ వాలెంటైన్‌ (Operation Valentine) సినిమాలో నటిస్తున్నాడు వరుణ్ తేజ్. వరుణ్ తేజ్ 13వ సినిమాగా రాబోతున్న ఈసినిమాను  శక్తి ప్రతాప్‌ సింగ్‌ హడ దర్శకత్వం వహిస్తుండగా.. ఈ ప్రాజెక్టుతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు వరుణ్ తేజ్. ఈసినిమాను  డిసెంబర్ 8న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేయడం కోసం సన్నాహాలు చేస్తున్నారు. 

ఇక వాలెంటైన్ తో పాటు.. వరుణ్ తేజ్  కరుణకుమార్ దర్శకత్వంలో  మరో సినిమా చేస్తున్నాడు. వరుణ్ తేజ్ నుంచి ఫస్ట్ పాన్ ఇండియా మూవీ రాబోతోంది.  ఈసినిమాను నటిస్తోన్న తొలి పాన్ ఇండియా సినిమా కోసం మేకోవర్ మార్చుకునే పనిలో పడ్డాడు వరుణ్ తేజ్‌. మట్కా టైటిల్‌తో వస్తున్న ఈ చిత్రంలో తన పాత్రకు తగ్గట్టుగా బాడీ లాంగ్వేజ్‌ను మార్చుకునే పనిలో బిజీగా ఉన్నాడు. వరుణ్ తేజ్‌ జిమ్‌లో చెమటోడుస్తూ.. సెల్ఫీ తీసుకుంటున్న స్టిల్‌ ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పీరియాడిక్ బ్యాక్‌ డ్రాప్ స్టోరీతో రాబోతున్న ఈ సినిమా వరుణ్ తేజ్‌ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో వస్తోన్న ప్రాజెక్ట్ విశేషం.

కథానుగుణంగా ఇందులో వరుణ్ తేజ్‌ నాలుగు డిఫరెంట్ గెటప్స్‌లో కనిపించబోతున్నాడని ఇన్‌సైడ్‌ టాక్‌. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, నోరాఫతేహి ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తుండగా.. త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుంది. ఇక పాన్ ఇండియా కథాంశంతో తెరకెక్కుతున్న ఆపరేషన్‌ వాలెంటైన్‌లో వరుణ్‌ తేజ్‌ ఫైటర్‌ పైలట్‌గా నటిస్తున్నాడు. ఈ చిత్రంలో మాజీ మిస్ యూనివర్స్‌ మానుషి ఛిల్లార్‌ (Manushi Chhillar) హీరోయిన్ గా నటిస్తోంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios