సినిమాలకు 6 నెలలు బ్రేక్ తీసుకోబోతున్న సాయి ధరమ్ తేజ్.. ఎందుకంటే..?
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ సినిమాలకు బ్రేక్ తీసుకోబోతున్నాడా..? ప్రస్తుతం ఇండస్ట్రీలో వినిపిస్తున్న మాట ఇది. మరి ఇందులో నిజం ఎంత..? అసలు ఎందుకు సాయి తేజ్ బ్రేక్ తీసుకోవాలి అనుకుంటున్నాడు..?

సాయిధరమ్ తేజ్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో బ్రో మూవీ రాబోతోంది. ఈ మూవీ కోసం మెగా ఫ్యాన్స్ వెయ్యి కళ్లతో ఎదరు చూస్తున్నారు. తమిళ సినిమా వినోదయసిత్తం మూవీకి తెలుగు రీమేక్ గా బ్రో మూవీ తెరకెక్కుతోంది. తమిళ వెర్షన్ ని డైరెక్ట్ చేసిన సముద్రఖని.. ఈ రీమేక్ ని కూడా డైరెక్ట్ చేశాడు. ఈ సినిమా ఈ నెల 28న రిలీజ్ కి సిద్దమవుతుంది. దీంతో సాయి ధరమ్ తేజ్ ప్రమోషన్స్ పనిలో పడ్డాడు.
ఇక బ్రో మూవీ ప్రమోషన్స్ లో.. సాయి ధరమ్ తేజ్ ఓ ఇంపార్టెంట్ విషయాన్ని వెల్లడించాడు. తాను సినిమాకు ఆరు నెలలు గ్యాప్ తీసుకోబోతున్నట్టు వెల్లడించాడు. గతంలో సాయి ధరమ్ బైక్ యాక్సిడెంట్ జరిగిన విషయం తెలిసిందే..? ఆ ప్రమాదం తరువాత చాలా కాలం రెస్ట్ తీసుకున్నాడు సాయి తేజ్. ఆతరువాత వచ్చిన విరూపాక్ష సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు సాయి తేజ్. ఈ మూవీ వచ్చిన మూడు నెలల గ్యాప్ లో బ్రో మూవీని కూడా తీసుకు రావడంతో అభిమానులు హ్యాపీ ఫీల్ అయ్యారు.
అయితే బ్రో మూవీ తరువాత ఆరు నెలలు పాటు బ్రేక్ ఇవ్వబోతున్నట్లు చెప్పి షాక్ ఇచ్చాడు సాయి తేజ్. అయితే సాయి ధరమ్ తేజ్ ఆ బైక్ యాక్సిడెంట్ నుంచి ఇంకా రికవరీ అవ్వలేదట.దానిని నుంచి కోలుకోవడానికి కొంత సమయం తీసుకోవాలని అనుకుంటున్నాడట. అతనికి యాక్సిడెంట్ వల్ల చేయాల్సిన ఓ సర్జరీ పెండింగ్ ఉందట. ఆ సర్జరీ కోసం ఆరు నెలలు పాటు గ్యాప్ తీసుకోని కంప్లీట్ రెస్ట్ లో ఉండి పూర్తిగా కోలుకోవడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే ప్రెజెంట్ ఎటువంటి సినిమా కథలు కూడా వినలేదని, అయితే ఈమధ్యలో తన ఫ్రెండ్స్ తో కలిసి చేసిన ఒక షార్ట్ ఫిలింని మాత్రం ఇండిపెండెన్స్ రోజు రిలీజ్ చేయబోతున్నట్లు వెల్లడించాడు.