మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటికే 10 మంది దాకా హీరోలు ఉన్నారు. టాప్‌ స్టార్స్ నుంచి మీడియం రేంజ్‌ హీరోలు, ఫెయిల్ అయిన హీరోలు కూడా ఉన్నారు. మెగా ఫ్యామిలీ నుంచి అమ్మాయిలు కూడా సినీ రంగంలో సత్తా చాటేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే నాగబాబు కూతురు నిహారిక హీరోయిన్‌గా ట్రై చేసి ఫెయిల్‌ అయినా వెబ్‌ లో మాత్రం సత్తా చాటుతోంది. వెబ్‌ సిరీస్‌లలో నటించటంతో పాటు నిర్మాతగానూ రాణిస్తోంది.

చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత కూడా సినీ రంగంలో కొనసాగుతోంది. మెగాస్టార్, రామ్ చరణ్‌ చిత్రాలకు కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా స్టైలిస్ట్‌గా వ్యవహరిస్తోంది సుస్మిత. తాజాగా మరో రంగంలోనూ సత్తా చాటేందుకు రెడీ అవుతోంది ఈ మెగా డాటర్‌. చాలా కాలంగా సినీరంగంతో సన్నిహితంగా ఉంటున్న సుస్మిత నిర్మాతగా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటుంది. ఈ మేరకు పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి.

ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుంచి అల్లు అరవింద్‌ నిర్మాతగా గీతా ఆర్ట్స్‌, గీతా ఆర్ట్స్ 2, బ్యానర్లతో పాటు రామ్ చరణ్ నిర్మాత కొణిదెల ప్రొడక్షన్ కంపెనీలు యాక్టివ్‌గా ఉన్నాయి. నాగబాబు నిర్మాతగా వ్యవహరించిన అంజన ప్రొడక్షన్‌ బ్యానర్‌లో ఒకప్పుడు సినిమాలు చేసిన ఇప్పుడు ఆ బ్యానర్‌లో సినిమాలు చేయటం లేదు. తాజాగా సుస్మిత కూడా నిర్మాతగా తన సత్తా చాటేందుకు రెడీ. అయితే ఇప్పటికే తమ్ముడు రామ్ చరణ్ నిర్మాతగా ఉండగా సుస్మిత మరో బ్యానర్ ఏర్పాటు చేసినా ఎవరితో సినిమాలు చేస్తుంది అన్న చర్చ జరుగుతోంది.

రామ్‌ చరణ్ ప్రస్తుతం చిరంజీవితో భారీ బడ్జెట్‌ సినిమాలు మాత్రమే చేస్తున్నాడు. ఒక వేళ సుష్మిత బ్యానర్‌ పెడితే ఆ బ్యానర్‌లో మీడియం రేంజ్‌ సినిమాలు ప్లాన్ చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే ఈ వార్తలపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.