Asianet News TeluguAsianet News Telugu

మణిరత్నంకి `మీటూ` సెగలు.. `నవరస` పరిస్థితేంటో?

`మీటూ`కి సంబంధించిన వాస్తవాలను వెల్లడించి చర్చనీయాంశంగా మారిన చిన్మయి శ్రీపాద మరోసారి `మీటూ` ఉద్యమాన్ని తెరపైకి తీసుకొచ్చారు. అయితే ఈ సారి టాప్‌ డైరెక్టర్‌ మణిరత్నంకి ఈ సెగ తగిలింది. 

meetoo effect on maniratnam navarasa  arj
Author
Hyderabad, First Published Oct 29, 2020, 6:46 PM IST

`మీటూ` ఉద్యమం పడుతూ లేస్తోంది. అప్పుడప్పుడు ఓ సునామిలా వచ్చిపోతుంది. దీనిపై నిజంగా ఎవరికీ చిత్తశుద్ధి లేదు. మహిళలు బలంగా తమ వాయిస్‌ని వినిపించడంలేదు. ఒకరిద్దరు మాత్రమే పదే పదే మాట్లాడుతున్నారు. ఇక సౌత్‌లో `మీటూ`కి సంబంధించిన వాస్తవాలను వెల్లడించి చర్చనీయాంశంగా మారిన చిన్మయి శ్రీపాద మరోసారి `మీటూ` ఉద్యమాన్ని తెరపైకి తీసుకొచ్చారు. అయితే ఈ సారి టాప్‌ డైరెక్టర్‌ మణిరత్నంకి ఈ సెగ తగిలింది. 

ఆ వివరాల్లోకి వెళితే.. మణిరత్నం ప్రస్తుతం `నవరస` పేరుతో తొమ్మిది మంది దర్శకులతో, తొమ్మిది ఎపిసోడ్లుగా ఓ వెబ్‌ సిరీస్‌ని రూపొందిస్తున్నారు. దీనికి తొమ్మిది మంది సంగీత దర్శకుడు, తొమ్మిది సినిమాటోగ్రాఫర్లు పనిచేస్తున్నారు. తొమ్మిది కథలను ఇందులో చెప్పబోతున్నారు. ఒక్కో కథలో ఒక్కో రసం ఉంటుంది. ఇలా నవరసాలను చూపించబోతున్నారు. దీనికి దర్శకులు కార్తీక్‌ సుబ్బరాజు, గౌతమ్‌ మీనన్‌, కేవీ ఆనంద్‌, అరవింద స్వామి, కార్తీక్‌ నరేన్‌, రతీంద్రన్‌, బిజోయ్‌ నంబియార్‌, పొన్‌రామ్‌, హలిత షలీమ్‌ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. 

అయితే ఈ సినిమాకి సింగర్‌ కార్తీక్‌ పనిచేస్తున్నారు. `మీటూ` వ్యవహారంలో కార్తీక్‌పై ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆయన్ని తీసుకోవడంపై నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేస్తుండటంతో దీనిపై తాజాగా చిన్మయి స్పందించింది. వేధింపులకు గురి చేసిన వ్యక్తికి అండగా నిలబడటం, అతనికి పని కల్పించడం బాధకరమని, తన లాంటి బాధితులు పనిలేక ఇబ్బందులు పడుతున్నారని చిన్మయి పేర్కొన్నారు. మరి దీనిపై మణిరత్నం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. 

Follow Us:
Download App:
  • android
  • ios