ఇప్పుడు ఆమె రీఎంట్రీ ఇస్తోంది. మళయాళంలో జయరామ్ సినిమాలో ఆమె చేస్తోంది.  ‘మ‌క‌ల్’ టైటిల్ తో రూపొందిన ఈ సినిమా టీజర్ రిలీజైంది.


 ‘ఓణి వేసిన దిపావళి వచ్చిందా ఇంటికి’ అంటూ ‘పందెంకోడి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది మీరా జాస్మిన్‌ గుర్రుండే ఉండి ఉంటుంది. మొదట ‘సూత్రదారన్’(2001) అనే మలయాళ సినిమాతో సినీరంగ ప్రవేశం చేసిన ఆమె ‘అమ్మాయి బాగుంది’ చిత్రంతో నేరుగా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది.ఇక వరస హిట్లు అందుకుని స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగిన మీరా జాస్మిన్‌ కొంతకాలంగా తెరపై కనుమరుగైంది.

 అనీల్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజ‌నీర్‌ను పెళ్లిచేసుకుని కెరీర్‌కు ఫుల్‌స్టాప్ పెట్టింది. వివాహం త‌ర్వాత కొన్నేళ్ల‌కు విభేదాలు రావడంతో ఈ జంట విడాకులు తీసుకుంది. ఇప్పుడు ఆమె రీఎంట్రీ ఇస్తోంది. మళయాళంలో జయరామ్ సినిమాలో ఆమె చేస్తోంది. ‘మ‌క‌ల్’ టైటిల్ తో రూపొందిన ఈ సినిమా టీజర్ రిలీజైంది. ఈ ట్రైలర్ అభిమానులకు పండగలా ఉంది. ఆ టీజర్ మీరూ ఓ లుక్కేయండి.

 తెలుగులోనూ ఈమె ఓ సినిమా చేయబోతోందని వినికిడి. రవితేజతో అప్పట్లో భ‌ద్ర వంటి హిట్ ఇచ్చిన బోయ‌పాటి శ్రీను త‌ననెక్స్ట్ సినిమాలో అవ‌కాశం ఇచ్చినట్లు స‌మాచారం. బోయ‌పాటి ప్ర‌స్తుతం రామ్ పోతినేనితో సినిమాను చెయ‌బోతున్నాడు. ఇందులో రామ్‌కు అక్క పాత్ర‌కోసం మీరాజాస్మిన్‌ను సంప్ర‌దించాడ‌ని చెప్పుకుంటున్నారు. త‌ను కూడా ఇందులో న‌టించేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిందని వినికిడి. ఇదే నిజ‌మైతే మీరాజాస్మిన్ రామ్ చిత్రంతో తెలుగులో రీ ఎంట్రీ ఇవ్వ‌బోతుంది. అఖండ స‌క్సెస్‌తో జోరుమీదున్న బోయ‌పాటి త‌న త‌దుప‌రి సినిమాను అదే స్పీడ్‌లో ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌ను పూర్తి చేస్తున్నాడ‌ట‌.