సీనియర్ హీరోయిన్ మీన అవేదన వ్యక్తం చేశార. తన  భర్త మరణంపై జరుగుతున్న చేస్తున్న అసత్య ప్రచారాన్ని ఆపాలన ఆమె వేడుకున్నారు. 

ఈ మధ్యే భర్తును కోల్పోయారు సీనియర్ హీరోయిన్ మీనా. అయితే భర్త చనిపోయిన రెండు మూడు రోజుల్లో ఆమె ఓ స్టేట్ మెంట్ ఇవ్వాల్సి వచ్చింది. త‌న భ‌ర్త విద్యా సాగ‌ర్‌ మ‌ర‌ణంపై సోష‌ల్ మీడియాలో జ‌రుగుతున్న అసత్య ప్ర‌చారంపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అసలే తన భర్త మరణించారన్న బాధలో తాను, తన కుటుంబం కోలుకోలేని స్థితిలో ఉంటే..అవన్నీ పట్టించుకోకుండా.. త‌న భ‌ర్త మ‌ర‌ణంపై అస‌త్య వార్త‌ల‌ను ప్ర‌సారం చేస్తున్నారంటూ ఆమె ఆవేద‌న వ్య‌క్తం చేశారు. 

ఇక‌నైనా ఇలాంటి సత్యదూరమైన వార్తలు ప్రచారం చేయకుండా ఆపాలంటూ ఆమె అందరిని వేడుకున్నారు. ఎవరికి తోచింది వారు రాయడానికి ఇది ఏదో ఓక వార్త కాదని.. ఇది తమ భావోద్వేగాలకు, తమ జీవితాలకు సంబంధించిన విషయం అని ఆమె అవేదనతో వేడుకున్నారు. మీనా విద్యాసాగర్ శ్వాస సంబంధిత వ్యాధి వల్ల చనిపోయారు. అయితే ఈ విషయంపై రకరకాల వార్తలు సోషల్ మీడియాతో పాటు మీడియాలో కూడా ప్రసారం అయ్యాయి. 

చెన్నైలోని మీనా ఇంటికి స‌మీపంలో భారీ సంఖ్య‌లో గుంపులు గుంపులుగా పావురాలు ఉంటాయ‌ని, వాటి నుంచి వ‌చ్చిన గాలిని పీల్చిన కార‌ణంగానే విద్యా సాగ‌ర్‌కు శ్వాస సంబంధ స‌మ‌స్య‌లు వ‌చ్చాయ‌ని.. ఓవార్త ప్రచారం ఉంది. వీటివల్లే మ‌ర‌ణించారంటూ జోరుగా ప్రచారం జరిగింది. దాంతో ఈ వార్త‌ల‌పై తాజాగా మీనా స్పందించారు.

 తన ప‌రిస్థితిని అర్థం చేసుకోవాలని.. తనకు త‌న కుటుంబ ప్రైవ‌సీకి భంగం క‌లిగించ‌వద్దని మీడియాను మీనా కోరారు. ఇలాంటి క‌ష్ట స‌మ‌యంలో త‌న‌కు అండ‌గా నిలిచిన వారికి ఆమె ధ‌న్య‌వాదాలు తెలిపారు. అంతే కాదు త‌న భ‌ర్త ప్రాణాల‌ను కాపాడేందుకు త‌మిళ‌నాడు ప్రభుత్వం, సీఎం, ఆరోగ్య శాఖ మంత్రి, అధికారులు ఇలా ప్రతీ ఒక్కరు తమ శాయ‌శ‌క్తులా కృషి చేశార‌ని ఆమె పేర్కొన్నారు. తన గురించి తాపత్రేయపడిన ప్రతీ ఒక్కరికి ఆమె ధ‌న్య‌వాదాలు తెలిపారు.