బాలీవుడ్ దర్శకుడు సాజిద్ ఖాన్ పై పలువురు నటీమణులు మీటూ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అతడు దర్శకత్వం వహిస్తోన్న  సినిమా నుండి తప్పించారు. తాజాగా హీరోయిన్ లారా దత్త భర్త, మాజీ టెన్నిస్ క్రీడాకారుడు మహేష్ భూపతి.. సాజిద్ ఖాన్ పై కామెంట్స్ చేశాడు.

సాజిద్ ఎలాంటి వాడో తన భార్య ముందే తనకు చెప్పిందని  అన్నాడు. ముంబైలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో మహేష్ భూపతి ఈ రకమైన కామెంట్స్ చేశారు. ''నేను లారా దత్తాతో డేటింగ్ లో ఉన్నప్పుడు ఆమె 'హౌస్ ఫుల్' సినిమాలో నటిస్తోంది. ఆ సమయంలో మేం లండన్ లో ఉన్నాం. ఇంటికి రాగానే సాజిద్ గురించి లారా తన స్నేహితురాలితో చెప్పడం నేను విన్నాను.

సెట్ లోని ఓ నటి పట్ల సాజిద్ అసభ్యకరంగా ప్రవర్తించాడని చెప్పింది. ఆ సినిమాలో అక్షయ్ కుమార్, రితేష్ దేశ్ ముఖ్, దీపిక పదుకొన్ వంటి తారలు ఉన్నారు. లారా దత్తా చెప్పిందంతా నేను విన్నాను. ఇంత జరుగుతున్నా సెట్ లో నలుగురు స్టార్లు ఉన్నప్పటికీ సదరు నటిని కాపాడలేకపోయారని లారాతో అన్నాను. 

అందుకే ఆమె కూడా చాలా బాధపడింది. సినిమా పరిశ్రమలో ఒక వ్యక్తి ప్రవర్తన సరిగ్గాలేకపోతే అతను ఎంత గొప్ప నటుడైనా అవకాశాలు రావు. అలాగని కళ్ల ముందు తప్పు జరుగుతున్నా.. పట్టించుకోకుండా పక్కకు తప్పుకోవడం కరెక్ట్'' అని వెల్లడించారు. ఇప్పటివరకు సాజిద్ పై నలుగురు నటీమణులు ఆరోపణలు చేశారు.