Asianet News TeluguAsianet News Telugu

చిరు “భోలా శంకర్” రిలీజ్ ఎప్పుడంటే....

మెగా మాసివ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా భోళా శంకర్ రానున్నట్టుగా చెప్తున్నారు. కిందటి ఏడాది శివరాత్రి సందర్భంగా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. మంచి రెస్పాన్స్ వచ్చింది. 

May release planning Chiranjeevi #BholaaShankar
Author
First Published Jan 20, 2023, 11:32 AM IST


మెగాస్టార్ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు లైనప్ లో ఉన్న సంగతి తెలిసిందే. వాల్తేరు వీరయ్య హిట్ టాక్ తెచ్చుకుంది. వెంటనే మెగా అభిమానులకు మరో గుడ్ న్యూస్. ఆయన నెక్ట్స్ చేస్తున్న  భోళా శంకర్ సినిమా రిలీజ్ గురించి ఓ అప్డేట్ అనీఫియల్ గా బయిటకు వచ్చింది. వాల్తేరు వీరయ్య ఊపు మీద ఉన్న చిరు ఈ జోష్ లోనే ఈ సినిమాని ముందుకు లాగుదామనుకున్నట్లు తెలుస్తోంది. అందుతున్న సమాచారం మేరకు 2023 మే నెలలో ఈ సినిమా రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేసుకోమని చిరంజీవి చెప్పారని వినికిడి. 
“భోలా శంకర్” షూటింగ్ రెండు రోజుల క్రితమే పునఃప్రారంభమైంది. మెగా బ్లాక్‌బస్టర్ ఫెస్టివల్ వైబ్‌ను కొనసాగిస్తూ హై పాజిటివ్ ఎనర్జీతో రామబ్రహ్మం సుంకర భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమా కొత్త షెడ్యూల్ హైదరాబాద్‌లోని భారీ కోల్‌కతా సెట్‌లో   ప్రారంభమైయింది.

వాల్తేరు వీరయ్యతో చిరంజీవి భారీ బ్లాక్ బస్టర్ సాధించడంతో భోళా శంకర్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మెహర్ రమేష్, చిరంజీవిని స్టైలిష్, ఇంకా మాస్ క్యారెక్టర్‌లో ప్రెజెంట్ చేస్తున్నారు.  క్రియేటివ్ కమర్షియల్స్‌తో కలిసి అనిల్ సుంకర ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. మహతి స్వర సాగర్ సంగీతం అందించగా, డడ్లీ డీవోపీగా పని చేస్తున్నారు. సత్యానంద్ కథ పర్యవేక్షణ చేయగా తిరుపతి మామిడాల డైలాగ్స్ అందిస్తున్నారు. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్ గా, ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు. కిషోర్ గరికిపాటి ఎగ్జిక్యూటివ్ నిర్మాత. ఈ సినిమా ప్రమోషనల్ మెటీరియల్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.

చాలా కాలంగా మెహర్ రమేష్ సైలెంట్ గానే ఉంటున్నాడు. 2013లో వెంకటేశ్ హీరోగా షాడో సినిమా వచ్చింది. ఆ తర్వాత చిరంజీవితో సినిమా చేస్తున్నాడు మెహర్. మెగా మాసివ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా భోళా శంకర్ రానున్నట్టుగా చెప్తున్నారు. కిందటి ఏడాది శివరాత్రి సందర్భంగా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. మంచి రెస్పాన్స్ వచ్చింది. మెగాస్టార్ స్టైలిష్ గా కనిపించారు. ఈ సినిమాకు మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నాడు. డూడ్లే సినిమాటోగ్రఫీ చేస్తున్నాడు.
 
  తమిళ సూపర్ హిట్ సినిమా వేదాళంకి రీమేక్ గా సినిమా వస్తోంది. చిరు సరసన తమన్నా(tamanna) నటిస్తుండగా.. మెగాస్టార్ చెల్లెలిగా కీర్తీ సురేశ్(Keerthy Suresh) ఉండనుంది. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర ఈ సినిమాను నిర్మిస్తున్నారు.  
 

Follow Us:
Download App:
  • android
  • ios