శ్రీమంతుడు, మిర్చి, జనతా గ్యారేజ్, రంగస్థలం లాంటి బడా చిత్రాలతో మైత్రి మూవీస్ సంస్థ టాలీవుడ్ లో అగ్ర నిర్మాణ సంస్థగా మారిపోయింది. భారీ బడ్జెట్ లో చిత్రాలు నిర్మిస్తూనే.. చిన్న చిత్రాలపై కూడా దృష్టిపెట్టింది. మైత్రి మూవీస్ నిర్మాణంలో త్వరలో రాబోతున్న చిత్రం 'మత్తు వదలరా'. తక్కువ బడ్జెట్ లో ఈ చిత్రాన్ని నిర్మించారు. 

రితేష్ రానా అనే డెబ్యూ దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో నూతన నటీనటులు నటిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి తనయుడు శ్రీ సింహ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. కీరవాణి మరో తనయుడు కాల భైరవ సంగీతం అందిస్తున్నాడు.

ఇటీవల విడుదలైన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ని రానా దగ్గుబాటి తన చేతుల మీదుగా లాంచ్ చేశాడు. క్రైమ్ అంశాలలతో దర్శకుడు ఉత్కంఠభరితంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. సినిమాపై ఆసక్తి పెరిగేలా ట్రైలర్ ని రూపొందించారు. 

 

డబ్బు కోసం ఆరాటపడే యువకుల కథ ఇది. డబ్బు కోసం స్నేహితులుగా ఉన్న వారు ఎలాంటి నేరాలకు పాల్పడ్డారనేది కథ. కమెడియన్ సత్య మంచి హాస్యాన్ని అందిస్తున్నాడు. డిసెంబర్ 25న ఈ చిత్రం రిలీజ్ కు రెడీ అవుతోంది.