కరోనా వైరస్ మరలా విజృభిస్తుంది. దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో కరోనా బారినపడుతున్నారు. దీనితో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. మాస్క్ ధరించడం తప్పని సరి చేస్తూ ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి. అలాగే సామాజిక దూరం పాటించాలంటూ ప్రజలకు సూచనలు ఇస్తున్నాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ఏదో రూపంలో కరోనా మహమ్మారి కబళిస్తుంది. వరుసగా అనేకమంది చిత్ర ప్రముఖులు కరోనా రోగులుగా మారుతున్నారు. 

తాజాగా యువ దర్శకుడు లోకేష్ కనకరాజ్ తనకు కరోనా సోకినట్లు తెలియజేశారు. పరీక్షల్లో తనకు కరోనా పాజిటివ్ అని తేలిందని, ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో జాయిన్ అయ్యానని తెలిపారు. చికిత్స అనంతరం తిరిగివస్తానని సోషల్ మీడియాలో ఓ నోట్ పంచుకున్నారు లోకేష్. 


ఇక ఇటీవల విజయ్ హీరోగా మాస్టర్ మూవీ తెరకెక్కించారు లోకేష్. విజయ్ సేతుపతి విలన్ గా నటించిన ఈ చిత్రం తమిళంలో భారీ విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం లోకేష్.. కమల్ హీరోగా విక్రమ్ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది.