Asianet News TeluguAsianet News Telugu

మెగా అభిమానులకు మాస్ ట్రీట్ రెడీ చేస్తున్న వాల్తేరు వీరయ్య టీమ్, ఇక ఫ్యాన్స్ కు పూనకాలే

మెగా అభిమానులకోసం మాస్ ట్రీట్ రెడీ చేస్తున్నారు వాల్తేరు వీరయ్య టీమ్. ఫ్యాన్స్ ఉర్రూతలూగేలా మాస్ సాంగ్ ను రిలీజ్ చేయబోతున్నారు.   
 

Mass Song From Mega Star Waltair Veerayya Relese Time Fixed
Author
First Published Dec 29, 2022, 8:35 AM IST

మెగాస్టార్ చిరంజీవి హీరోగా శృతీ హాసన్ హీరోయిన్ గా నటిస్తోన్న సినిమా వాల్తేరు వీరయ్య . బాబీ అలియాస్ కేఎస్‌ రవీంద్ర డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ మూవీ ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది మూవీ. ఇక ఈ సినిమా రిలీజ్ కు సంబంధించిన సన్నాహాలు ఇప్పటికే స్టార్ట్ చేశారు టీమ్. రీసెంట్ గా ప్రెస్ మీట్ ను ఘనంగా నిర్వహించారు టీమ్. రిలీజ్ కు  టైమ్ దగ్గర పడుతుండటంతో.. ప్రమోషన్ల జోరు పెంచారు టీమ్. 

ఇక  ఇప్పటికే వాల్తేరు వీరయ్య నుంచి రిలీజ్ అయిన  పాటలు మ్యూజిక్ లవర్స్ ను ఆకట్టుకుంటున్నాయి. కాగా ఈ సినిమా నుంచి రిలీజ్ చేయాల్సిన మెగా మాస్ సాంగ్‌ ఒకటి ఉందని రీసెంట్ గా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో..   బాబీ, డీఎస్పీ, శేఖర్ మాస్టర్ వెల్లడించిన విషయం తెలిసిందే. ఇక ఈసాంగ్ కోసం ముహూర్త ఫిక్స్ చేశారు మేకర్స్. ఈ సినిమాకే ఈ సాంగ్ హైలెట్ అవ్వబోతున్నట్టు తెలుస్తోంది. 

అన్ని పాట్లల్లో బెస్ట్  సాంగ్‌గా ఉండబోతున్న పూనకాలు పాటను రిలీజ్ చేయడానికి డేట్ ఫిక్స్ చేశారు మేకర్స్.  డిసెంబర్ 30న ఈ పాటను  లాంఛ్ చేయబోతున్నట్టు సమాచారం. తాజా టాక్‌ ప్రకారం ఆర్‌టీసీ ఎక్స్ రోడ్స్ లోని సంధ్య థియేటర్‌ లో డిసెంబర్ 30న సాయంత్రం 6 గంటలకు విడుదల చేయనుండగా.. దీనిపై అధికారిక ప్రకటన కూడా రానుందని ఇన్‌ సైడ్‌ టాక్‌. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ  సినిమాపై మెగా ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. 

బాలీవుడ్ భామ ఊర్వశి రౌటేలా బాస్‌ పార్టీ స్పెషల్ సాంగ్‌లో మెరువబోతుంది. మాస్ మహారాజా రవితేజ కీలక పాత్ర పోషిస్తున్న ఈ మూవీ నుంచి ..  రీసెంట్‌గా రిలీజ్ అయిన వాల్తేరు వీరయ్య టైటిల్‌ ట్రాక్‌  నెట్టింటిని షేక్ చేస్తోంది.

Follow Us:
Download App:
  • android
  • ios