విడాకులకు కారణం అదే... ఓపెన్ గా చెప్పేసిన యంగ్ హీరోయిన్!

యంగ్ హీరోయిన్ వర్ష బొల్లమ్మను విడాకులకు కారణం ఏమిటని అడగ్గా... ఓపెన్ గా చెప్పేసింది. ఆమె చెప్పిన రీజన్ తెలిస్తే మీరు అవాక్కవుతున్నారు. 
 

marriage is reason for divorce young heroine varsha bollamma shocking statement ksr

కన్నడ భామ వర్ష బొల్లమ్మ కెరీర్ కోలీవుడ్ లో మొదలైంది. 2015లో విడుదలైన తమిళ చిత్రం సతురన్ లో హీరోయిన్ గా నటించింది. చిన్న చిత్రాల్లో హీరోయిన్ గా చేస్తూనే... వర్ష బొల్లమ్మ సపోర్టింగ్ రోల్స్ కూడా చేసింది. విజయ్ బ్లాక్ బస్టర్ మూవీ బిగిల్ లో లేడీ ఫుట్ బాల్ టీమ్ లో ఒక ప్లేయర్ గా ఆమె కనిపించారు. ఇక తెలుగులో వర్ష బొల్లమ్మ మొదటి చిత్రం చూసి చూడంగానే. ఓ కొత్త హీరోకి జంటగా నటించింది. 

ఆనంద్ దేవరకొండకు జంటగా నటించిన మిడిల్ క్లాస్ మెలోడీస్ హిట్ టాక్ తెచ్చుకుంది. అయితే ఈ మూవీ నేరుగా ఓటీటీలో విడుదలైంది. దాని వలన పెద్దగా ఫేమ్ రాలేదు. పుష్పక విమానం, స్టాండప్ రాహుల్, స్వాతిముత్యం చిత్రాల్లో వర్ష హీరోయిన్ గా నటించింది. ఇటీవల విడుదలైన ఊరు పేరు భైరవకోన చిత్రంలో సందీప్ కిషన్ కి జంటగా నటించింది. ఈ మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. కానీ కమర్షియల్ గా ఆడలేదు. 

వర్ష బొల్లమ్మ కొత్త మూవీ ప్రకటించలేదు. ఇదిలా ఉంటే... సోషల్ మీడియా వేదికగా ఆమె చేసిన కామెంట్ చర్చకు దారి తీసింది. ఓ లేడీ ఫ్యాన్ ఆమెను... ఈరోజుల్లో విడాకులకు కారణం ఏమిటి? అని అడిగాడు. ఈ ప్రశ్నకు సంకోచించకుండా సమాధానం చెప్పింది వర్ష బొల్లమ్మ. వివాహమే విడాకులకు కారణం అని ఒకింత వ్యంగ్యంతో కూడిన ఆన్సర్ ఇచ్చింది. అసలు పెళ్లి చేసుకోకపోతే విడాకుల ప్రస్తావనే లేదు. కాబట్టి విడాకులకు కారణం పెళ్లి అని ఇంటెలిజెంట్ ఆన్సర్ ఇచ్చింది. 

వర్ష సమాధానానికి సదరు అభిమాని షాకై ఉంటుంది అనడంలో సందేహం లేదు. నిజానికి చాలా మంది యువత సహజీవనం సంస్కృతికి అలవాటు పడ్డారు. ఈ కాన్సెప్ట్ లో విడాకుల సమస్య ఉండదు. ఇద్దరికీ నచ్చినన్ని రోజులు కలిసి ఉండొచ్చు. మనస్పర్థలు తలెత్తితే గుడ్ బై చెప్పుకొని ఎవరి దారి వాళ్ళు చూసుకోవచ్చు. చట్టపరమైన ఇబ్బందులు ఉండవు. ఒకప్పుడు సెలెబ్రెటీలకు పరిమితమైన సహజీవనం సంస్కృతి... ఇప్పుడు సాధారణ జనాల్లోకి కూడా వెళ్ళింది. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios