బాలీవుడ్ తో పాటు పలు ప్రాంతీయ చిత్రాలపై రివ్యూలు రాయటంలో పాటు, పలు చిత్రాలకు నటుడిగా, దర్శకుడిగా పనిచేసిన కమాల్, సోషల్ మీడియాలో చేసే కామెంట్స్ వార్తల్లో నిలుస్తుంటాయి. అప్పట్లో పవన్ కళ్యాణ్ పై చేసి కామెంట్స్ తో దక్షిణాదిలో కూడా కమాల్ పేరు మారుమోగింది.
బాలీవుడ్ క్యారక్టర్ ఆర్టిస్ట్ మనోజ్ బాజ్ పేయ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన సినిమాల్లోనే కాకుండా వెబ్ సీరిస్ ల ద్వారానూ బాగా పాపులర్ అవుతున్నారు. ముఖ్యంగా మనోజ్ బాజ్‌పాయ్ నటించిన ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ మంచి ఆదరణ పొందగది. ఆ తర్వాత దీనికి సీక్వెల్ రూపొందొందిది. సమ్మర్‌లో ఇది రిలీజ్ కానుంది. సమంత ఇందులో నెగెటివ్ పాత్ర పోషించిన విషయం తెలిసిందే. 'ఫ్యామిలీ మ్యాన్-1'ను తన భుజాల మీద నడిపించిన మనోజ్ బాజ్ పేయి రెండో సీజన్లోనూ అదరగొట్టేశాడు. ఎంతో సీరియస్ గా కనిపిస్తూ అతను కామెడీ పండించిన తీరు మరోసారి షోకు హైలైట్ గా నిలిచింది. తొలి సీజన్ తో పోలిస్తే మనోజ్ పాత్ర ఈసారి మరింత వినోదాన్ని పంచింది. తాజాగా ఆయన బాలీవుడ్ విమర్శకుడు పై క్రిమినల్ కేసు పెట్టమని కోర్టుకు వెళ్లారు.
వివరాల్లోకి వెళితే... బాలీవుడ్ తో పాటు పలు ప్రాంతీయ చిత్రాలపై రివ్యూలు రాయటంలో పాటు, పలు చిత్రాలకు నటుడిగా, దర్శకుడిగా పనిచేసిన కమాల్, సోషల్ మీడియాలో చేసే కామెంట్స్ వార్తల్లో నిలుస్తుంటాయి. అప్పట్లో పవన్ కళ్యాణ్ పై చేసి కామెంట్స్ తో దక్షిణాదిలో కూడా కమాల్ పేరు మారుమోగింది. రీసెంట్ గా సల్మాన్ ఖాన్ సైతం ఈ వివాదాస్పద బాలీవుడ్ విశ్లేషకుడు కమాల్ ఆర్ ఖాన్ ని కోర్టుకు లాగారు. ఇప్పుడు మనోజ్ బాజ్ పేయి వంతు వచ్చింది. కేఆర్కేపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని కంప్లైంట్ చేశాడు.
జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ (జీఎంఎఫ్ సీ) కోర్టులో కేఆర్కేపై ఐపీసీ సెక్షన్ 500, 46 కింద కేసు నమోదు చేయాలని కోరాడు. జులై 26న కేఆర్కే తనపై ట్వీట్ చేసి..తన అభిమానులు, ఫాలోవర్లలో తనకున్న ప్రతిష్టను అవమానకరమైన రీతిలో దిగజార్జాడని మనోజ్ బాజ్ పేయి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు కోర్టులో ప్రత్యేకంగా హాజరై తన వాంగ్మూలాన్ని నమోదు చేశారు. ఈ వ్యవహారంలో కేఆర్కేపై క్రిమినల్ పరువు నష్టం దావా నమోదు చేయాలని విజ్ఞప్తి చేశాడు.
