కింగ్ నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్లుగా నటించిన ‘మన్మథుడు 2’ చిత్రం భారీ అంచనాల నడుమ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దాదాపు పదిహేడేళ్ల క్రితం వచ్చిన సూపర్ హిట్ సినిమా 'మన్మథుడు'కి సీక్వెల్ గా 'మన్మథుడు 2'ని రూపొందించారు. 

రాహుల్ రవీంద్రన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది. కీర్తి సురేష్, సమంత అక్కినేని, అక్షర గౌడ ప్రత్యేక పాత్రల్లో మెరవగా.. లక్ష్మి, వెన్నెల కిషోర్, రావు రమేష్, ఝాన్సీ, దేవదర్శిని ప్రధాన పాత్రలు పోషించారు.

టీజర్, ట్రైలర్ లతో ఈ సినిమాపై పాజిటివ్ బజ్ ఏర్పడింది. అమెరికాలో ముందుగానే సినిమా ప్రీమియర్లు షోలు వేయడంతో టాక్ బయటకి వచ్చింది. నాగార్జున బాగా ఎంటర్టైన్ చేశారని.. ప్లే బాయ్ అవతారంలో ఆయన నటన బాగుందని.. ఫస్ట్ హాఫ్ చాలా ఎంటర్టైనింగ్ గా ఉందని.. ఇంటర్వల్ బ్యాలన్స్డ్ గా ఉందని చెబుతున్నారు.

థియేటర్ లో నాగార్జున గ్లామర్ కి అందరూ ఫిధా అవుతారని.. అంత అందంగా ఉన్నారని ట్వీట్లు చేస్తున్నారు. కొందరు మాత్రం సెకండ్ హాఫ్ చాలా స్లోగా ఉందని.. ఏవరేజ్ సినిమా అని అంటున్నారు.