కింగ్ నాగార్జున నటించిన 'మన్మథుడు 2' సినిమా శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను రాహుల్ రవీంద్రన్ డైరెక్ట్ చేశారు. అయితే ఈ సినిమా ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోతుంది. కొందరికి కనెక్ట్ అయినప్పటికీ ఓవరాల్ గా మాత్రం సినిమాకి హిట్ టాక్ అయితే రాలేదు. అయినప్పటికీ సినిమా మీద హైప్ ఉండడంతో ఓపెనింగ్స్ అయితే బాగానే రాబట్టింది. తొలిరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 3.86 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఒక్క నైజాం ఏరియాలోనే 1.3 కోట్లు వసూలు చేసింది. ఇక, రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా తొలి రోజు 5.03 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. 

ఏరియాల వారీగా వసూళ్లు 
నైజాం......................... రూ. 1.30 కోట్లు 
సీడెడ్........................... రూ. 0.48 కోట్లు 
ఉత్తరాంధ్ర.................. రూ. 0.46 కోట్లు 
ఈస్ట్................................. రూ. 0.35 కోట్లు 
వెస్ట్................................... రూ. 0.28 కోట్లు 
కృష్ణ.................................. రూ. 0.28 కోట్లు 
గుంటూరు........................ రూ. 0.54 కోట్లు 
నెల్లూరు............................. రూ. 0.18 కోట్లు 

రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా రూ. 3.86 కోట్లను రాబట్టింది. కర్ణాటకలో రూ. 0.62 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా.. రూ. 0.25 కోట్లు.. అమెరికాలో ప్రీమియర్ షోల ద్వారా 0.30 కోట్లు వసూలు చేసింది. మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ. 5.03 కోట్ల షేర్ ని రాబట్టింది.