పాపులర్ టీవీ షోలను స్టార్స్  హోస్ట్ చేయటానికి కారణం కేవలం డబ్బు మాత్రమే కాదు. ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గర అవ్వాలని. అందుకే స్టార్స్ ..బుల్లి తెర వైపు ఎట్రాక్ట్ అవుతున్నారు. ఇప్పటికే చిరంజీవి, నాగార్జున, ఎన్టీఆర్, రానా వంటి స్టార్ వివిధ రకాల టీవి షోలతో జనాలకు దగ్గరయ్యారు. అదే కోవలం బిగ్ బాస్ సైతం జనాల్లోకి బాగా వెళ్లిన షో. మొదటి సీజన్ కు ఎన్టీఆర్ హోస్ట్ చేసారు. తదుపరి సీజన్స్ చేయటానికి ఆయన బిజీ షెడ్యూల్స్ లో కుదరలేదు. దాంతో రెండో సీజన్ కు నాని, ఇప్పుడు మూడో సీజన్ కు నాగ్ హోస్ట్ చేస్తున్నారు. అంతవరకూ బాగానే ఉంది. 

కానీ ఈ షో లో పాల్గొన్న సమయంలో ఎన్టీఆర్ చేసిన జై లవకుశ చిత్రం కమర్షియల్ గా వర్కవుట్ కాలేదు. ఆ చిత్ర దర్శకుడు బాబికి సైతం సినిమా రావటానికి చాలా కాలం పట్టింది. అలాగే రెండవ సీజన్ టైమ్ లో నాని చేసిన దేవదాసు చిత్రం కమర్షియల్ డిజాస్టర్ అయ్యింది. దాంతో ఇప్పుడు ఈ మూడో సీజన్ టైమ్ లో నాగ్ సినిమా  ‘మన్మథుడు 2’ పై అలాంటి నెగిటివ్ సెంటిమెంట్ ప్రభావం ఉంటుందా అని చర్చలు సోషల్ మీడియాలోనూ,  పిల్మ్ సర్కిల్స్ లోనూ జరుగుతున్నాయి.

అయితే ఓ విషయం మాత్రం నిజం. సినిమాలో విషయం ఉంటే సినిమా హిట్ అవుతుంది. దాన్ని ఏ నెగిటివ్ సెంటిమెంట్ ఆపలేదు. అయితే కోట్లతో నడిచే బిజినెస్ కాబట్టి కొంత టెన్షన్ ఉంటుంది. ఏదైమైనా రేపు ఈ టైమ్ కు సినిమా రిజల్ట్ వచ్చేస్తుంది. 

న్యూ జనరేషన్‌ కథతో కింగ్ నాగార్జున నటించిన సినిమా ‘మన్మథుడు 2’. రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకుడు. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్. . ‘అన్నమయ్య’ తర్వాత ఈ సినిమా కోసం నాగార్జున స్వచ్ఛమైన తెలుగు మాట్లాడారు. పోర్చుగల్‌లో సాగే కథ ఇది. ఈ సినిమాలో సమంత, కీర్తి సురేశ్‌ అతిథి పాత్రల్లో కొద్దిసేపు మాత్రమే కనిపిస్తారు ఈ ఆగస్టు 9న విడుదల కాబోతుంది.  అన్నపూర్ణ స్టూడియోస్,వియాకామ్ 18 స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సీనియర్ నటి లక్ష్మి,రావు రమేష్,వెన్నెల కిషోర్,ఝాన్సీ కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ మూవీకి చైతన్ భరద్వాజ్ సంగీతం సమకూర్చారు.