Asianet News TeluguAsianet News Telugu

'మంజుమ్మెల్ బాయ్స్' 40 రోజుల కలెక్షన్స్ ...అరాచకం,అసలు ఊహించం

మంజుమ్మెల్ బాయ్స్ ఏప్రిల్ 6, 2024న తెలుగులో గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధంగా ఉంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ సర్వైవల్ థ్రిల్లర్‌ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తోంది. 

Manjummel Boys Malayalam Version Worldwide 40 Days Total Theatrical Gross jsp
Author
First Published Apr 3, 2024, 7:14 AM IST


 మ‌ల‌యాళంలో విడుద‌లై సంచ‌ల‌న విజ‌యం సాధించి రికార్డుల మీద రికార్డులు తిర‌గ రాస్తున్న‌చిత్రం మంజుమ్మెల్ బాయ్స్. తెలుగులో డబ్బింగ్ అయ్యి రాబోతున్న ఈ సినిమా పై మనవాళ్ల దృష్టీ పడింది. దాంతో   ఇప్పుడ ఎక్కడ చూసినా ఈ సినిమా సృష్టిస్తున్న సెన్సేషన్ గురింజచే. అంతా కొత్త వారితో రియ‌ల్‌ ఇన్సిడెంట్ అధారంగా తెర‌కెక్కిన ఈ సినిమా మ‌ల‌యాళ ఇండ‌స్ట్రీని షేక్ చేసి ప‌డేస్తోంది.  మొద‌టి రోజు నుంచే సూప‌ర్ సాజిటివ్ టాక్‌తో కేర‌ళ‌లో దూసుకువెళ్తోంది. తమిళంలో రిలీజ్ చేస్తే అక్కడ సెన్సేషన్ అయ్యింది.  ఇంత‌వ‌ర‌కు ఏ పెద్ద స్టార్‌ చూడ‌లేని విజ‌యాన్ని, ఏ చిత్రానికి సాధ్య‌ప‌డ‌ని వ‌సూళ్లను రాబ‌డుతూ మ‌ల‌యాళ ఇండ‌స్ట్రీని షేక్ చేసి ప‌డేస్తోంది.  ఈ నేపధ్యంలో ఇప్పటి దాకా ఎంత కలెక్ట్ చేసిందో చూద్దాం.

ఫస్ట్ వీకెండ్  - 06.90cr

మొదటి వారం  1 - 50.40cr
రెండో వారం  - 67.20cr
మూడో వారం- 52.70cr
నాలుగో వారం - 22.55cr
ఐదో వారం -  13.85cr 
ఆరో వారం -  03.92cr (3Days)


ఇండియా గ్రాస్  - 148.50cr

ఓవర్ సీస్  - 72.00cr

ప్రపంచ వ్యాప్తంగా 40 రోజుల టోటల్ థియోట్రకల్ గ్రాస్  - 220.50 Cr. All Time BLOCK BUSTER

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలిచే అవకాశాలున్నాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మీ అభిప్రాయాన్ని ఇక్కడ షేర్ చేయండి.

 మంజుమ్మెల్ బాయ్స్ ఏప్రిల్ 6, 2024న తెలుగులో గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధంగా ఉంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ సర్వైవల్ థ్రిల్లర్‌ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తోంది. ఈ చిత్రం కి సంబందించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను మేకర్స్ గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు. ఏప్రిల్ 3 వ తేదీన సాయంత్రం 6:00 గంటల నుండి హోటల్ దస్పల్ల, హైదరాబాద్ లో జరగనుంది.
 
 ఇప్ప‌టికే మ‌న తెలుగు వాళ్లు కూడా ఈ సినిమాను మ‌ల‌యాళంలోనూ చూస్తు ప్ర‌శంస‌లు గుప్పిస్తుండ‌డం విశేషం. కామెడీ, ఎమోష‌న్‌, సంగీతం, సస్పెన్స్‌, థ్రిల్లింగ్ ఇలా అన్ని ర‌కాల భావోద్వేగాల‌తో ప్రేక్ష‌కుడిని సీట్ ఎట్జ్‌లో కూర్చోబెట్టేలా రూపొందిన ఈ చిత్రానికి చిదంబ‌రం ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. దీంతో ఇప్పుడు త‌మిళ‌, మ‌ల‌యాళ సెల‌బ్రిటీలు ఈ డైరెక్ట‌ర్‌ని ఓ రేంజ్‌లో మెచ్చుకుంటూ ఆకాశానికెత్తేస్తున్నారు.

క‌థ ఏమిటంటే.... కేర‌ళ‌లో ని మంజుమ్మెల్ (Manjummel) ప్రాంతానికి చెందిన గ్రూప్ ఆఫ్ ప్రెండ్స్ దాదాపు ఓ ప‌ది మంది టూర్‌కు వెళ్లి తిరిగి వ‌స్తుంటారు. ఈక్ర‌మంలో క‌మ‌ల్‌హ‌స‌న్ న‌టించిన గుణ అనే సినిమా షేటింగ్ జ‌రిగిన ఓ గుహ‌ను చూడ‌డం మ‌రిచిపోయామంటూ ఆ గుహ ద‌గ్గ‌ర‌కు వెళ‌తారు. అప్పుడు అనుకోకుండా ఒక‌త‌ను ఆ గుహాలో ప‌డి పోతాడు. దీంతో అత‌నిని బ‌య‌ట‌కి తీసుకురావ‌డానికి ఆ మిత్ర బృందం చేసిన సాహ‌సం నేప‌థ్యంలో సినిమాను తెర‌కెక్కించారు. ఇంకా చాలా స‌న్నివేశాల‌లో గుణ సినిమాలోని క‌మ్మ‌నీ ఈ ప్రేమ‌ను అనే పాట‌ను, క‌మ‌ల్ వాయిస్‌ను బాగా వాడ‌డం కూడా ఈ చిత్రానికి బాగా క‌లిసొచ్చింది.

Follow Us:
Download App:
  • android
  • ios