సూపర్ స్టార్ కృష్ణ నటవారసులలో ఆయన కుమార్తె మంజుల ఘట్టమనేని కూడా ఉన్నారు. 1998లో విడుదలైన మలయాళ చిత్రం సమ్మర్ ఇన్ బెత్లెహాం మూవీలో లీడ్ హీరోయిన్స్ లో ఒకరిగా మంజుల నటించారు. ఆ తరువాత రాజస్థాన్ అనే ఓ చిత్రంలో టెర్రరిస్ట్ గా క్యామియో రోల్ చేయడం జరిగింది. 2002లో షో అనే చిత్రాన్ని నిర్మించి నటించారు. ఆ మూవీ జాతీయ ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ అవార్డు దక్కించుకోవడం విశేషం. 

ఐతే మంజుల హీరోయిన్ గా చేయడం, కృష్ణ ఫ్యాన్స్ ఇష్టపడలేదు. అభిమానుల కోరిక మేరకు మంజుల సినిమా పై ప్రేమ వదులుకోలేక నిర్మాతగా మారారు. మహేష్ నటించిన నాని, పోకిరి చిత్రాలను మంజుల నిర్మించడం జరిగింది. సందీప్ కిషన్ హీరోగా వచ్చిన మనసుకు నచ్చింది చిత్రానికి మంజుల దర్శకత్వం వహించడం విశేషం.

ఐతే సినిమాకు తో పాటు డైట్, ఫిట్నెస్ వంటి విషయాలపై కూడా అవగాహన ఉందని మంజుల చెప్పుకొచ్చారు. తాజా ఇంటర్వ్యూలో మహేష్ గురించి మంజుల కొన్ని ఆసక్తికర విషయాలు తెలియజేశారు. మహేష్ తన కంటే చిన్నవాడైనప్పటికీ ఆమెనే అనేక విషయాలలో గైడ్ చేస్తాడట. అందరూ అనుకుంటున్నట్లు మహేష్ కి నేను దిశా నిర్ధేశం చేయనని మంజుల వివరించారు. అందరూ నా బ్యూటీ సీక్రెట్ ఏమిటని అడుగుతారు, కానీ అది నాన్న జీన్స్ ద్వారా వచ్చిందని మంజుల అన్నారు.