Asianet News TeluguAsianet News Telugu

బాహుబలి - KGF ఫార్మాట్ లో మణిరత్నం హిస్టారికల్ ప్రాజెక్ట్!

కంటెంట్ కరెక్ట్ గా ప్రజెంట్ చేయగలిగితే నేషనల్ వైడ్ లో బాక్స్ ఆఫీస్ రికార్డులను బద్దలు కొట్టవచ్చని దర్శకుడు రాజమౌళి నిరూపించాడు. అయితే ఆ రేంజ్ లో సక్సెస్ సాధించాలంటే చాలా అలోచించి అడుగులు వేయాలి. 

maniratnam ponniyin selvan success format
Author
Hyderabad, First Published May 10, 2019, 8:16 AM IST

బాహుబలి అనంతరం సౌత్ ఇండస్ట్రీలో చాలా మార్పులు వచ్చాయని చెప్పవచ్చు.  కంటెంట్ కరెక్ట్ గా ప్రజెంట్ చేయగలిగితే నేషనల్ వైడ్ లో బాక్స్ ఆఫీస్ రికార్డులను బద్దలు కొట్టవచ్చని దర్శకుడు రాజమౌళి నిరూపించాడు. అయితే ఆ రేంజ్ లో సక్సెస్ సాధించాలంటే చాలా అలోచించి అడుగులు వేయాలి. 

స్టోరీ లైన్ పెద్దగా ఉన్నా అలాగే బడ్జెట్ రేంజ్ పెంచాలని అనుకున్నా ఇప్పుడు పాన్ ఇండియన్ సినిమాలు రెండు భాగాలుగా విడిపోతున్నాయి. ఇది ఒక విధంగా సేఫ్ ఫార్మాట్ అని చెప్పవచ్చు. మణిరత్నం కూడా అదే తరహాలో ఆలోచిస్తున్నాడు. బాహుబలి - KGF స్టయిల్ల్లో రెండు భాగాలుగా తన పొన్నియన్ సెల్వన్ సినిమాను తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నాడు.  

విక్రమ్ - అమితాబ్  బచ్చన్ - ఐశ్వర్య రాయ్ - విజయ్ సేతుపతి - జయం రవి  అలాగే అనుష్క - కీర్తి సురేష్ వంటి ప్రముఖ నటీనటులు నటిస్తున్న హిస్టారికల్ మూవీ పొన్నియన్ సెల్వన్ కి బడ్జెట్ 700 కోట్లు ఖర్చయ్యేలా ఉందని టాక్. అందుకే దర్శకుడు మణిరత్నం సినిమాను రెండు పార్ట్ లుగా విభజించి సినిమాను మంచి స్కెల్ తో నిర్మించాలని ప్లాన్ చేస్తున్నాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios