ఫెమస్ నవలారచయిత కల్కీ రాసిన 'పొన్నియన్‌ సెల్వన్‌' అనే హిస్టారికల్ నవల ఆధారంగా మణిరత్నం సినిమాను తెరక్కేక్కిస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు 800కోట్ల భారీ బడ్జెట్ తో రెండు భాగాలుగా ఈ సినిమాను నిర్మించనున్నారు. అయితే సినిమాకు సంబందించిన స్పెషల్ న్యూస్ ఇప్పుడు కోలీవుడ్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

సినిమాలో మొత్తం 12పాటలు ఉంటాయట. ఆస్కార్ విన్నర్ ఏఆర్.రెహమాన్ ఈ హిస్టారికల్ ఫిల్మ్ కి సంగీతం అందించనున్నారు. సినిమా కోసం కొత్త తరహా మ్యూజిక్ ని కంపోజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. మొత్తం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా డిఫరెంట్ గా క్లాసిక్ స్టైల్ లో ప్లాన్ చేసుకుంటున్నట్లు సమాచారం. ఈ బిగ్ ప్రాజెక్ట్ లో సౌత్ - నార్త్ కి సంబందించిన స్టార్ నటీనటులను మణిరత్నం సెలెక్ట్ చేసుకున్నారు 

ప్రస్తుతం పొన్నియన్‌ సెల్వన్‌' ప్రీ ప్రొడక్షన్ పనులు ఎండింగ్ కి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఎండింగ్ లో చిత్ర యూనిట్ రెగ్యులర్ షూటింగ్ ని మొదలుపెట్టనుంది. ఈ సినిమాలో కార్తీ - జయంరవి - అమితాబ్ బచ్చన్ అలాగే ఐశ్వర్య రాయ్ - కీర్తి సురేష్ - అమలాపాల్ వంటి స్టార్ యాక్టర్స్ నటిస్తున్నారు.