Asianet News TeluguAsianet News Telugu

యూఎస్ లో పొన్నియిన్ సెల్వన్ చిత్రానికి రికార్డు ఓపెనింగ్స్!

భారీ అంచనాల మధ్య విడుదలైన పొన్నియిన్ సెల్వన్ ఓపెనింగ్స్ అదే స్థాయిలో ఉన్నాయి. ఈ మూవీ కోలీవుడ్ రికార్డ్స్ బద్దలు చేయడం ఖాయంగా కనిపిస్తుంది. పొన్నియిన్ సెల్వన్ యూఎస్ లో వసూళ్ల దుమ్ము దులిపింది. 
 

maniratnam ponniyin selvan grabs record opening colletions in us
Author
First Published Sep 30, 2022, 12:39 PM IST

మణిరత్నం ప్రతిష్టాత్మక చిత్రం పొన్నియిన్ సెల్వన్ కోలీవుడ్ గత చిత్రాలు రికార్డ్స్ బ్రేక్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది. యూఎస్ ప్రీమియర్ వసూళ్లలో నయా రికార్డు సెట్ చేసింది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం $1.002 మిలియన్ కలెక్షన్స్ రాబట్టింది. పొన్నియిన్ సెల్వన్ బీస్ట్ రికార్డు బ్రేక్ చేసింది. విజయ్ బీస్ట్ మూవీ $415000 ప్రీమియర్స్ వసూళ్లను అధిగమించింది. 

సినిమాపై ఏర్పడిన హైప్ భారీ ఓపెనింగ్స్ కి కారణం అవుతుంది. ఇక పొన్నియిన్ సెల్వన్ డీసెంట్ టాక్ సొంతం చేసుకుంది. కథ, విజువల్స్, మ్యూజిక్ ఆకట్టుకున్నా ప్రేక్షకులు ఆశించే యాక్షన్, ఉత్కంఠరేపే సన్నివేశాలు లేవన్న మాట వినిపిస్తోంది. అలాగే మిగతా భాషల ఆడియన్స్ కి నేటివిటీ ప్రాబ్లమ్ రావచ్చంటున్నారు. ఆ పాత్రలు, వాటి పేర్లు గుర్తు పెట్టుకోవడం కష్టమే అంటున్నారు.

తమిళ్ లో పొన్నియిన్ సెల్వన్ మంచి విజయం సాధించవచ్చు. మిగతా భాషల్లో ఎలాంటి ప్రభావం చూపుతుందో వీకెండ్ ముగిస్తే కానీ తెలియదు. విక్రమ్, కార్తీ, జయం రవి, విక్రమ్ ప్రభు, ఐశ్వర్య రాయ్, త్రిషతో పాటు పలువురు స్టార్ క్యాస్ట్ ఈ మూవీలో నటించారు. మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించాయి. పొన్నియిన్ సెల్వన్ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతం సమకూర్చారు. 

Follow Us:
Download App:
  • android
  • ios