పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కు రెడీ అవుతోంది మణిరత్నం పొన్నియిన్ సెల్వన్, ఈ మూవీ నుంచి అప్ డేట్ కోసం ఎదురు చూస్తున్న ఆడియన్స్ కు సర్ ప్రైజింగ్ ట్రీట్ రెడీ చేస్తున్నారు టీమ్.
సీనియర్ డైరెక్టర్ మణిరత్నం దర్వకత్వంలో చియాన్ విక్రమ్, కార్తి, జయం రవి, ఐశ్వర్యరాయ్, త్రిష, బాబీ సింహా వంటి స్టార్లు లీడ్ రోల్స్ ల్లో నటిస్తున్న సినిమా పొన్నియిన్ సెల్వన్. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి మొదటి భాగం సెప్టెంబర్ 30న రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమా నుంచి వరుసగా ప్రమోషలన్స్ ను ప్లాన్ చేసుకుంటున్నారు మూవీ టీమ్. ఈ క్రమంలో మేకర్స్ వరుసగా అప్‌డేట్స్ ఇస్తున్నారు. తాజాగా మేకర్స్ ఈ చిత్రానికి సంబంధించిన బిగ్ అప్‌డేట్‌ను అనౌన్స్ చేశారు. . త్వరలో ఈమూవీ నుంచి ఫస్ట్ సాంగ్ సందడి చేయబోతోంది.
పొన్నియిన్ సెల్వన్ కు ఆస్కర్ విన్నర్ ఏఆర్ రెహ్మన్ మ్యూజిక్ చేస్తున్నారు. ఆయనకు అసిస్టంటె గా డ్రమ్మర్ శివమణి పనిచేస్తున్నారు. ఇక వీరిద్దరు ఫస్ట్ సింగిల్ కంపోజింగ్ పనిలో బిజీగా ఉన్నారు. ఏ.ఆర్ రెహమాన్, డ్రమ్మర్ శివమణితో కలిసి ఫస్ట్ సింగిల్‌నురూపొందిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. త్వరలో ఈ పాట రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తారని తెలుస్తోంది. ఈ సాంగ్ తో ఒక ఊపు ఊపేయాలన్న పట్టుదలతో ఉన్నాడు రెహ్మన్.

మణిరత్నం నుండి సినిమా వస్తుందంటే ఆడియన్స్ తో పాటు ఇండస్ట్రీ అంతా అటువైపే చూస్తుంది. సినిమా ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తుంటారు. కొద్ద దర్శకులతో పాటు అప్పుడప్పుడే ఇండస్ట్రీలో ఎదుగుతున్నవారికి మణిరత్నం సినిమాలు లెసన్స్ లాంటివని నమ్ముతారు. మణిరత్నం టేకింగ్ గాని, విజువలైజేషన్ గాని వేరే లెవల్లో ఉంటాయి. ఈయన సినిమాల్లో కథలు సాధారణంగానే ఉన్న స్క్రీన్ ప్లే మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే మణిరత్నం తన సినిమాలతో ఎంటర్టైన్ చెయ్యడమే కాకుండా ప్రేక్షకులను ఆలోచింపజేస్తుంటాడు.
ఇక మణిరత్నం పొన్నియన్ సెల్వన్ సినిమాను చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా.. కరోనా టైమ్ లో కూడా మణిరత్నం సినిమాపై పట్టుదలో ఉన్నాడు. రీసెంట్ గా కరోనా బారిన పడిన మణిరత్నం సినిమా పనులు ఆఫ్ లైన్ లో చేస్తూనే ఉన్నాడు. ఇక లైకా ప్రొడక్షన్స్ సంస్థతో కలిసి మద్రాస్ టాకీస్ బ్యానర్‌పై మణిరత్నం స్వీయ నిర్మాణంలో తెరకెక్కించాడు. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.
