Asianet News TeluguAsianet News Telugu

చైనా బాక్స్ ఆఫీస్ పై గురిపెట్టిన మణికర్ణిక

చైనాలో కూడా ఇండియన్ సినిమాలు పాజిటివ్ టాక్ తో మంచి కలెక్షన్స్ ని రాబడుతున్నాయి. దంగల్ దెబ్బకు డైరెక్ట్ చైనీస్ లో రిలీజ్ చేస్తూ డిస్ట్రిబ్యూటర్స్ లబాల్ని అందుకుంటున్నారు. ఇక ఇప్పుడు మరో ఇండియన్ సినిమా చైనా బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేసేందుకు సిద్ధమైంది.

manikarnika big release in china
Author
Hyderabad, First Published Oct 1, 2019, 8:50 PM IST

చైనాలో కూడా ఇండియన్ సినిమాలు పాజిటివ్ టాక్ తో మంచి కలెక్షన్స్ ని రాబడుతున్నాయి. దంగల్ దెబ్బకు డైరెక్ట్ చైనీస్ లో రిలీజ్ చేస్తూ డిస్ట్రిబ్యూటర్స్ లబాల్ని అందుకుంటున్నారు. ఇక ఇప్పుడు మరో ఇండియన్ సినిమా చైనా బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేసేందుకు సిద్ధమైంది. బాక్స్ ఆఫీస్ క్వీన్ గా తనకంటూ ఒక స్పెషల్ క్రేజ్ తెచ్చుకున్న ఇండియన్ బ్యూటీ కంగనా రనౌత్ మణికర్ణికతో చైనా బాక్స్ ఆఫీస్ పై గురిపెట్టింది.

స్టార్ హీరోలతో సమానంగా 100కోట్ల వరకు బిజినెస్ చేయగల ఈ వీరనారి ఈ ఏడాది మణికర్ణికతో స్ట్రాంగ్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. వీరనారి ఝాన్సీ లక్ష్మీ భాయి జీవిత ఆధారంగా తెరకెక్కిన ఆ సినిమా సౌత్ లో కూడా మంచి కలెక్షన్స్ ని రాబట్టింది. ఇక ఫైనల్ గా నెక్స్ట్ ఇయర్ జనవరి 3న చైనాలో భారీగా రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. తెలుగు దర్శకుడు క్రిష్ తో పాటు కంగనా ఈ సినిమాకు దర్శకత్వం వహించగా బాహుబలి రచయిత విజయేంద్రప్రసాద్ కథను అందించారు.

అయితే దంగల్ అనంతరం బాహుబలి అలాగే మరికొన్ని సినిమాలు కూడా చైనాలో భారీగా రిలీజ్ అయ్యాయి. కానీ ఏ సినిమా కూడా అనుకున్నంతగా సక్సెస్ కాలేకపోయాయి. రీసెంట్ గా 2.0 కూడా రిలీజయింది. కానీ ఆ సినిమా అక్కడ ఏ మాత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకోలేకపోయింది. డిజాస్టర్ గా నిలిచింది. మరి ఇప్పుడు మణికర్ణిక ఎలాంటి సక్సెస్ ని అందుకుంటుందో చూడాలి.

Follow Us:
Download App:
  • android
  • ios