భారతీయ దర్శక దిగ్గజాల్లో మణిరత్నం ఒకరు. ఈయన చిత్రాలకు ఉన్న  క్రేజ్ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 'నాయకుడు', 'రోజా', 'బొంబాయి', 'గీతాంజలి' వంటి చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానుల్ని సంపాదించుకున్నారు. కథ, కథాలతోపాటు వినూత్నమైన మేకింగ్ స్టైల్ ఆయనకు మాత్రమే సొంతం. అయితే మణిరత్నం స్థాయికి తగ్గ హిట్ రాలేదు.

'ఓకే బంగారం' చిత్రంతో ఓ మోస్తరు విజయాన్ని అందుకున్న ఈ స్టార్ దర్శకుడు అర‌వింద స్వామి, జ్యోతిక‌, శింబు, విజ‌య్ సేతుప‌తి, ప్ర‌కాశ్ రాజ్, అరుణ్ విజ‌య్‌, ఐశ్వ‌ర్య రాజేశ్‌, త్యాగ‌రాజ‌న్ త‌దిత‌ర భారీ తారాగ‌ణంలో నిర్మించిన చిత్రం "నవాబ్". ఈ చిత్రం  హిట్ అయ్యి ఆయనకు ఊరట ఇచ్చింది. దాంతో ఇండస్ట్రీ మొత్తం దృష్టి ఆయనపై పడింది. 

ఇప్పుడు ఆయన ఏ సినిమా చేయబోతున్నారనే విషయమై అనేక రూమర్స్, టాక్స్ బయిలుదేరాయి. ఆయన నెక్ట్స్  సినిమాను స్టార్ హీరోలు విజయ్, విక్రమ్, శింబులతో కలిసి చేస్తున్నారని అన్నారు.  మరో ప్రక్క  మణిరత్నం ప్లాన్ చేస్తోంది మల్టిస్టారర్ కాదని విజయ్ తో సినిమా అని అంటున్నారు. అయితే ఇందులో నిజమెంత అనేది తమిళ మీడియా ఎంక్వైరీ చేసింది. 

తమిళ మీడియా చెప్పేదాని ప్రకారం...  అలాంటిదేం లేదని, ఈ ప్రాజెక్ట్ రూమర్లకు మాత్రమే పరిమితమని, అసలు విజయ్ 2019 మార్చి వరకు ఏ కొత్త సినిమాకు సైన్ చేయరని తమిళ సినీ వర్గాల సమాచారం.  దీంతో అభిమానుల్లో, ప్రేక్షకుల్లో ఈ భారీ మల్టీస్టారర్ ఊహలు చెదిరిపోయాయి.