Asianet News TeluguAsianet News Telugu

దుమ్ములేపుతున్న మంగ్లీ పాడిన `బొడ్రాయి` పాట..

ఇటీవల `సారంగ దరియా`తో ఓ ఊపు ఊపిన గాయని మంగ్లీ ఇప్పుడు మరో పాటతో వచ్చింది. ఆమె `చిల్‌ బ్రో` చిత్రంలో ఆమె పాడిన `బొడ్రాయి` పాట యూట్యూబ్‌లో విశేష ఆదరణ పొందుతుంది. 

mangli sung bodrai song viral its reflect village culture
Author
Hyderabad, First Published Oct 23, 2021, 3:42 PM IST

మంగ్లీ(Mangli) జానపద గాయనిగా గుర్తింపు తెచ్చుకుని, ఇప్పుడు సినిమాల్లో ప్లే బ్యాక్‌ సింగర్‌గా పాపులారిటీని సొంతం చేసుకుంది. వరుసగా ఊపున్నపాటలు పాడుతూ శ్రోతల్లో ఉత్సాహాన్ని నింపడంతోపాటు సినిమాల్లో తమ పాటలను హైలైట్‌గా నిలుపుతుంది. ఇటీవల `సారంగ దరియా`తో ఓ ఊపు ఊపిన మంగ్లీ ఇప్పుడు మరో పాటతో వచ్చింది. ఆమె `చిల్‌ బ్రో` చిత్రంలో ఆమె పాడిన `బొడ్రాయి` పాట యూట్యూబ్‌లో విశేష ఆదరణ పొందుతుంది. 

`గిరా గిరా.. `అనే లిరిక్‌తో సాగే ఈ బొడ్రాయి పాటకి Mangli గాత్రం తోడు కావడంతో జోష్‌ నింపుతుంది. పల్లెటూళ్లో బొడ్రాయి పండుగల గొప్పతనాన్ని, వాటిని సెలబ్రేట్‌ చేసుకునే విధానాన్ని ఆవిష్కరిస్తూ సాగే ఈ పాట తెగ ఆకట్టుకుంటుంది. మాస్‌ శ్రోతలను మరింత మెప్పిస్తుంది. ఊపుతీసుకొస్తుంది. డీజే సాంగ్‌లకు బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తుంది. విడుదలైన క్షణం నుంచే లక్షల వ్యూస్‌తో దూసుకుపోతుందీ పాట. మంగ్లీ తనదైన గాత్రంతో పాటకి ప్రాణం పోసిందని చెప్పొచ్చు. 

ఇక `చిల్‌ బ్రో` సినిమా విషయానికి వస్తే.. అరుణోద‌య ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్ లో ప్రొడ‌క్ష‌న్ నెంబ‌ర్ 1గా రాబోతున్న చిత్రమిది. ఈ బ్యానర్‌లో మొద‌టి సినిమా అయినప్ప‌టికీ నిర్మాతగా శ్రీను చెంబేటీ ఈ సినిమాను అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మించారు. సూర్య శ్రీనివాస్, ప‌వ‌న్ కేసి, రూపిక‌, ఇందు ముఖ్య తారాగ‌ణంగా న‌టిస్తున్న ఈ సినిమాను ల‌వ్ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్ టైనర్ గా ద‌ర్శ‌కుడు కుంచం శంక‌ర్ తెర‌కెక్కిస్తున్నారు. 

`ఇప్ప‌టికే విడుద‌లైన `చిల్ బ్రో` ప‌బ్లిసిటీ కంటెంట్ కి ప్రేక్ష‌కులు నుంచి అనూహ్య‌మైన స్పంద‌న ల‌భించింది. ఈ నేప‌థ్యంలో పముఖ గాయ‌ని మంగ్లీ పాడిన బొడ్రాయి అంటూ సాగే పాట‌ను చిత్ర బృందం విడుద‌ల చేశారు. మంగ్లీ వాయిస్ కి, మ్యూజిక్ డైరెక్ట‌ర్ సురేశ్ బొబ్బిలి ఇచ్చిన ట్యూన్స్ వెర‌సీ ఈ పాట ప్ర‌స్తుతం ట్రెండ్ అవుతుంది. మ్యాంగో మ్యూజిక్ ద్వారా ఈ సినిమా ఆడియో విడుద‌లైంది. అతి త్వ‌ర‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం` అని నిర్మాత శ్రీను చెంబెటీ తెలిపారు.

also read: Prabhas Birthday: ప్రభాస్‌ ఊతపదానికి ఇంత పెద్ద కథ ఉందా?.. ఎంతైనా `డార్లింగ్‌` అనిపించుకున్నాడుగా!

Follow Us:
Download App:
  • android
  • ios