MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • Prabhas Birthday: ప్రభాస్‌ ఊతపదానికి ఇంత పెద్ద కథ ఉందా?.. ఎంతైనా `డార్లింగ్‌` అనిపించుకున్నాడుగా!

Prabhas Birthday: ప్రభాస్‌ ఊతపదానికి ఇంత పెద్ద కథ ఉందా?.. ఎంతైనా `డార్లింగ్‌` అనిపించుకున్నాడుగా!

ప్రభాస్‌ ప్రస్తుతం హీరోగా ఎవరికీ సాధ్యం కాని ఇమేజ్‌ని ఆస్వాధిస్తున్నాడు. ఇండియన్‌ సినిమాకి ప్రతిరూపంగా నిలుస్తున్నాడు. అందరు ముద్దుగా `డార్లింగ్‌` అని పిలుచుకునే ప్రభాస్‌కి ఒక ఊతపదం ఉంది. దానికో స్టోరీ కూడా ఉండటం. ఆయన బర్త్ డే సందర్భంగా అది బయటకు రావడం ఆకట్టుకుంటుంది.   

2 Min read
Author : Aithagoni Raju
Published : Oct 23 2021, 03:19 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ప్రభాస్‌(Prabhas).. `బాహుబలి`, `సాహో`, `రెబెల్‌` వంటి బలమైన టైటిల్స్ తో సినిమాలు చేశాడు. ఆయా సినిమాలు బాక్సాఫీసు వద్ద మంచి విజయాలను సాధించాయి. ఇప్పుడు `రాధేశ్యామ్‌`, `సలార్‌`, `ఆదిపురుష్‌` వంటి భారీ సినిమాలు చేస్తున్నారు. కానీ ఇప్పటికే ప్రభాస్‌ని అంతా `డార్లింగ్‌` అనే పిలుస్తుంటారు. అభిమానులు, సెలబ్రిటీలు సైతం ఆయన్ని డార్లింగ్‌గానే అభివర్ణిస్తుంటారు. అలా పిలిచేందుకే ఇష్టపడుతుంటారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

మరి ప్రభాస్‌ని `డార్లింగ్‌`గా పిలవడానికి ఓ కథ ఉంది. ఆయన `డార్లింగ్‌` సినిమాలో నటించడమే అనే విషయం తెలిసిందే. జనరల్‌గా హీరోల మ్యానరిజనానికి యాప్ట్ అయ్యే టైటిల్స్ తో సినిమాలు చేసే హీరోలకు ఆ సినిమాల పేరుతోనే పిలుస్తుంటారు అభిమానులు. అలా ఆయా పేర్లు పాపులర్‌ అవుతుంటాయి. అలానే ప్రభాస్‌కి `డార్లింగ్‌` అనే టైటిల్‌ యాప్ట్ గా నిలిచింది. పాన్‌ ఇండియా సినిమాలెన్నో చేసుకుంటూ వెళ్తున్న ఆయన్ని అంతా డార్లింగ్‌ అంటూనే సంభోధిస్తున్నారు. 

36

అంతగా ప్రభాస్‌ని `డార్లింగ్‌` అని పేరు పిలవడానికి ఓ కథ ఉందట. ఆ డార్లింగ్‌లో ఓ స్టోరీ ఉందట. నేడు శనివారం(అక్టోబర్ 23)న ప్రభాస్‌ తన 42వ పుట్టిన రోజు(Prabhas Birthday) జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రభాస్‌రాజుకి సంబంధించిన ఆసక్తికర విషయాలు వైరల్‌ అవుతున్నాయి. కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. అలా వచ్చిందే `డార్లింగ్` వెనక ఉన్న సీక్రెట్ స్టోరీ. 
 

46

Prabhas.. ఏ కరుణాకర్‌ దర్శకత్వంలో వచ్చిన `డార్లింగ్‌` సినిమా మంచి విజయం సాధించింది. ప్రభాస్‌కి `డార్లింగ్‌` పేరుని తీసుకొచ్చింది. కానీ ప్రభాస్‌కి `డార్లింగ్‌` అనే పేరు ఈ సినిమాతో వచ్చింది కాదట. ఆయనకు అంతకు ముందు నుంచే ఉందని చెప్పారు. అది ప్రభాస్‌ ఊతపదం అట. `బుజ్జిగాడు` సినిమాలో దాన్ని బాగా వాడాడు ప్రభాస్‌. ఆ వాడకం నచ్చే `డార్లింగ్‌` సినిమాకి ఆ పేరు పెట్టారట. 

56

అయితే స్వతహాగా ప్రభాస్‌ ఎవరినైనా, అంటే తనకు బాగా నచ్చిన వారిని డార్లింగ్‌ అనే పిలుస్తాడట. ఇది కెరీర్‌ బిగినింగ్‌ నుంచి కూడా ఉందట. కాకపోతే `బుజ్జిగాడు` సినిమాతో పాపులర్‌ అయ్యిందని తెలుస్తుంది.  ఆ సినిమా సమయంలో ప్రభాస్‌.. పూరీ జగన్నాథ్‌ని డార్లింగ్‌ అని పిలిచాడట. ఆ పిలిచే విధానం నచ్చడంతో పూరీ ఆ సినిమాలో ఆ పదాన్ని బాగా వాడేలా చేశాడని సమాచారం. ప్రభాస్‌ తన చుట్టూ ఉండే అందరిని అదే పదంతో పిలుస్తారని, అది ఆయన ఊతపదమని పూరీ చెప్పారు. దీన్ని ప్రభాస్‌ కూడా ఒప్పుకోవడం విశేషం. 
 

66

ప్రభాస్‌ తన ఊతపదంగా `డార్లింగ్‌` అని పిలవడం మాత్రమే కాదు, స్వతహాగా ఆయన మనసు కూడా అలాంటిదే అని, అందరితోనూ సానుకూలంగా, పాజిటివ్‌గా ఉంటారని, ఆయన చాలా స్వీట్‌ పర్సన్‌ అని, ఒక్కసారి ఆయనతో పనిచేస్తే ఎవరైనా ఆయన్ని ఇష్టపడతారని అంటున్నారు. అందుకే ప్రభాస్‌ అందరికి `డార్లింగ్‌` అని అంటున్నారు అభిమానులు. ప్రభాస్‌ ప్రస్తుతం పాన్‌ ఇండియా స్టార్ గా రాణిస్తున్నారు. ఆయన నటిస్తున్న సినిమాలన్నీ పాన్‌ ఇండియా రేంజ్‌లో భారీ బడ్జెట్‌తో రూపొందుతుండటం విశేషం. దీంతో పాన్‌ ఇండియా నుంచి పాన్ వరల్డ్ స్టార్‌గానూ పేరు తెచ్చుకుంటున్నారు డార్లింగ్‌. 

related news: ఆ విషయంలో అమితాబ్‌ బచ్చన్‌ని మించిపోయిన ప్రభాస్‌.. ఇండియన్‌ సినిమాకి `ఒకేఒక్కడు`.. అందుకు కారణం కూడా ఒక్కడే

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
వినోదం
ప్రభాస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Chaitra Rai: వర్షిణి, సుధీర్ హైడ్రామా అట్టర్ ఫ్లాప్.. బిగ్ బాస్ హౌస్ నుంచి చైత్ర రాయ్ అవుట్, మరో ఎలిమినేషన్
Recommended image2
Shrimad Bhagavatam: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు ఏడు భాగాలుగా విష్ణువు కథ.. భారీ స్కేల్‌లో సినిమాలు
Recommended image3
The Paradise: ది ప్యారడైజ్ మూవీకి ట్రైలర్ లేదు.. బాంబు పేల్చిన నాని, ఏం జరుగుతోంది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved