`మంగళవారం` కలెక్షన్లు.. వరల్డ్ కప్‌ దెబ్బ గట్టిదే!

పాయల్‌ రాజ్‌పుత్‌ ప్రధాన పాత్రలో నటించిన `మంగళవారం` మూవీకి పాజిటివ్‌ టాక్‌ వచ్చింది. మౌత్‌ టాక్‌ స్ప్రెడ్‌ అయ్యింది. కానీ వరల్డ్ కప్‌ మాత్రం పెద్ద షాకిస్తుంది.

mangalavaram movie collections world cup big effect arj

పాయల్‌ రాజ్‌పుత్‌ ప్రధాన పాత్రలో నటించిన `మంగళవారం` మూవీ శుక్రవారం విడుదలై పాజిటివ్‌ టాక్‌తో రన్‌ అవుతుంది. `ఆర్‌ఎక్స్ 100` ఫేమ్‌ అజయ్‌ భూపతి దర్శకత్వంలో రూపొందిన చిత్రం కావడం, ట్రైలర్‌ ఆకట్టుకోవడంతో సినిమాపై భారీ అంచనాలున్నాయి. ప్రీమియర్స్ కి మంచి స్పందన లభించింది. క్రిటికల్‌గానూ సినిమాకి పాజిటివ్‌ రియాక్షన్‌ వచ్చింది. అయితే టాక్‌ కి తగ్గ కలెక్షన్లు లేవనే టాక్‌ వచ్చింది. తొలి రోజు ఈ మూవీ రెండు కోట్ల షేర్‌ సాధించింది. 

ఇక రెండో రోజు కూడా అదే స్థాయిలో వసూళ్లని రాబట్టింది. ఈ మూవీ రెండో రోజు మరో నాలుగు కోట్ల గ్రాస్‌ సాధించింది. మొత్తంగా రెండు రోజుల్లో ఈ మూవీ రూ.8.49 కోట్ల గ్రాస్‌ సాధించింది. అయితే మొదటిరోజుతో పోల్చితే స్వల్పంగా పెరిగింది. అయితే ఈ మూవీపై వరల్డ్ కప్‌ ప్రభావం గట్టిగానే ఉంది. అంతా వరల్డ్ కప్‌ క్రికెట్‌ మ్యాచ్‌ మూడ్‌లో ఉన్నారు. సినిమాలపై అంతటి ఆసక్తిని చూపించడం లేదు. దీంతో బాగున్నా సినిమాలను కూడా జనం చూసేందుకు ఆసక్తి చూపించడం లేదు. ఆ ప్రభావం `మంగళవారం` మూవీ విషయంలో కనిపిస్తుంది. 

ఆదివారం ఆ ప్రభావం చాలా ఉంది. మార్నింగ్‌ షోలు కొంత వరకు ఓకే కానీ, మధ్యాహ్నం నుంచి చాలా వరకు పడిపోయాయి. చాలా థియేటర్లు క్రికెట్‌ మ్యాచ్లు లైవ్‌లు టెలికాస్ట్ చేయడం విశేషం. దీంతో సినిమాలను పక్కన పెట్టారు. అయితే ఇప్పుడు ఏ సినిమాకైనా వీకెండ్‌ చాలా ముఖ్యం. ఈ మూడు రోజుల్లోనే చాలా వరకు కలెక్షన్లు వస్తాయి.కానీ `మంగళవారం` సినిమాకి అసలైన ఆదివారం గట్టి దెబ్బ పడిందని చెప్పొచ్చు. మరి సోమవారం నుంచి ఈ మూవీ సత్తా చాటుతుందా? కలెక్షన్లు స్టెబుల్‌గా ఉంటాయా? అనేది చూడాలి. 

ఇక దాదాపు పదిహేను కోట్ల బిజినెస్‌తో విడుదలైన ఈ మూవీకి ఇప్పటి వరకు నాలుగున్నర కోట్ల షేర్‌సాధించింది. ఇంకా పది కోట్లకుపైగా షేర్‌ రావాల్సి ఉంది. అంటే ఈ మూవీ సుమారు 22కోట్ల గ్రాస్‌ చేయాలి. మరి ఏ మేరకు సత్తా చాటుతుందో చూడాలి. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios