#Mangalavaram ఫస్ట్ డే కలెక్షన్స్..బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఎంత రావాలి ?
టీజర్, ట్రైలర్ తో మంచి హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా నవంబర్ 17న థియేటర్స్ లో రిలీజైంది. మొదటి షో నుండే ఈ సినిమాకు ఆడియన్స్ నుండి పాజిటివ్ టాక్ వచ్చింది.

‘RX 100’తో మొదటి సినిమాతోనే అందరి దృష్టిలో పడ్డ దర్శకుడు అజయ్ భూపతి. ఈ సినిమాతోనే పాయల్ రాజ్‌పూత్ కూడా ఇక్కడ మన వారికి దగ్గరైంది. ఈ సినిమా తర్వాత ఆమె వరుస సినిమాలు చేసినా... ఏవీ వర్కవుట్ కాలేదు. మరోవైపు అజయ్ భూపతి కూడా ‘మహాసముద్రం’తో డిజాస్టర్ అందుకున్నాడు. దీంతో ఈసారి ఎలాగైనా హిట్టు కొట్టాలన్న లక్ష్యంతో పాయల్‌తో కలిసి ‘మంగళవారం’ (Mangalavaram) అనే డార్క్ థ్రిల్లర్‌ను మన ముందుకు తెచ్చారు అజయ్. టీజర్, ట్రైలర్లు ఆసక్తిరేకెత్తించేలా ఉండటం, అల్లు అర్జున్ వంటి స్టార్ ఈ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడం సినిమాపై ఎక్సపెక్టేషన్స్ పెరిగాయి...ఓపినింగ్స్ బాగా వచ్చాయి. అయితే బ్రేక్ ఈవెన్ అవ్వటానికి ఈ ఓపినింగ్స్ ఏ మాత్రం ఉపయోగపడతాయి.. (Mangalavaram Movie box office collections)?
వాస్తవానికి ట్రేడ్ మంగళవారం చిత్రం కలెక్షన్స్ మాసివ్ గా భారిగా ఉంటాయని ఎక్సపెక్ట్ చేసింది. అయితే ఫస్ట్ డే కలెక్షన్స్ యావరేజ్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ఊహించిన స్దాయిలో నెంబర్స్ నమోదు కాలేదు. రివ్యూలు, మౌత్ టాక్ ..యావరేజ్ కంటెంట్..హై టెక్నికల్ వాల్యూస్ తో అని చెప్పటం కొంతవరకూ కలిసివచ్చింది. దాంతో చాలా చోట్ల సెకండ్ షోలు హౌస్ ఫుల్స్ అయ్యాయి. ఓవరాల్ గా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 2.2 కోట్లదాకా నమోదు చేసినట్లు సమాచారం. అయితే థియేటర్ వాల్యూ 13 కోట్లు కావంటంతో ఈ రోజు,రేపు ఆదివారం ఈ కలెక్షన్స్ రెట్టింపు అయితేనే బ్రేక్ ఈవెన్ కు ట్రాక్ లో ఉన్నట్లు లెక్క.
సాధారణంగా ఆదివారం టాక్ బాగున్న సినిమాలు హౌస్ ఫుల్స్ అవుతూంటాయి. అయితే వరల్డ్ కప్ ఫైనల్ ... ఇంపాక్ట్ పడితే మాత్రం ఇబ్బందే. అయితే ఫ్యామిలీలకు ఈ సినిమా కాస్తంత దూరంగానే ఉంటుంది. ముఖ్యంగా దీంట్లోని అక్రమ సంబంధాల వ్యవహారం.. కొన్ని ద్వంద్వార్థ సంభాషణలు.. హీరోయిన్ కు ఉన్న సమస్య వంటివి ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఎబ్బెట్టుగా అనిపించొచ్చు. ఈ చిత్రంలో కనిపించే ఓ ప్రత్యేకత ఏంటంటే.. ఇంట్రవెల్ ముందు వరకు పాయిల్ కనిపించకున్నా.. అసలు కథ మొదలు కాకున్నా.. ఎక్కడా బోర్ కొట్టించకుండా కథను ముందుకు నడిపించారు దర్శకుడు అజయ్. శనివారం, ఆదివారం వీకెండ్స్ లో బాక్సాఫీస్ దగ్గర దుమ్ము రేపితేనే ఈ సినిమాకు కలిసివచ్చినట్లు. తెలుగులో కూడా ఇప్పుడు పెద్ద సినిమాలు ఏమీ లేవు కాబట్టి నెక్స్ట్ వీక్ వరకు మంగళవారం హవా కొనసాగనుంది.