టాలీవుడ్ హీరో మంచు విష్ణు మరోసారి తండ్రి కాబోతున్నాడు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ''స్పెషల్ ప్లేస్ నుండి స్పెషల్ అనౌన్స్మెంట్.. ఇది విన్నీ స్వస్థలం.

నాకెంతో ఇష్టమైన ప్రదేశం. ఇప్పటికే మా కుటుంబంలోకి అరియానా, వివియానా, అవ్రమ్ వచ్చారు. ఇప్పుడు నాలుగో ఏంజెల్ కూడా రాబోతుంది'' అంటూ  రాసుకొచ్చారు. తన భార్యతో దిగిన ఫోటోను పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ చూసిన అభిమానులంతా కంగ్రాట్స్ అంటూ విష్ణుకి విషెస్ చెబుతున్నారు.

మరికొందరు మాత్రం ఫ్యామిలీ ప్లానింగ్ ఒకటి ఉందని తెలుసా..? అంటూ మంచు విష్ణుపై సెటైర్ లు వేస్తున్నారు. ప్రస్తుతం ఈ హీరో 'ఓటర్' సినిమాతో బిజీగా ఉన్నాడు. కార్తిక్ రెడ్డి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నారు.

త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో పాటు 'కన్నప్ప' అనే సినిమాలో కూడా నటించడానికి రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా కథ ఇంకా స్క్రిప్ట్ దశలోనే ఉంది.