మా ప్రెసిడెంట్, హీరో మంచు విష్ణు నటిస్తున్న తాజా చిత్రం 'గాలి నాగేశ్వర రావు'. ఈ చిత్రంతో ఎలాగైనా హిట్ కొట్టాలని విష్ణు దృఢ సంకల్పంతో ఉన్నాడు. 

మా ప్రెసిడెంట్, హీరో మంచు విష్ణు నటిస్తున్న తాజా చిత్రం 'గాలి నాగేశ్వర రావు'. ఈ చిత్రంతో ఎలాగైనా హిట్ కొట్టాలని విష్ణు దృఢ సంకల్పంతో ఉన్నాడు. సినిమా ప్రారంభమైన రోజు నుంచే విభిన్నమైన ప్రమోషనల్ టెక్నిక్స్ ఉపయోగిస్తూ బజ్ క్రియేట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. 

ఈ క్రమంలో తాజాగా చిత్ర యూనిట్ టైటిల్ లోగో రిలీజ్ చేశారు. దీనికోసం చిన్న ప్రమోషనల్ వీడియో క్రియేట్ చేశారు. ఈ వీడియోలో విష్ణు తనపై తానే సెటైర్లు వేసుకుంటూ కనిపిస్తున్నాడు. సినిమా ప్రారంభం నుంచి ఈ చిత్ర టైటిల్ గాలి నాగేశ్వర రావు అంటూ ప్రచారం జరుగుతోంది. 

కానీ మూవీ టీం క్రియేటివిటీకి పదును పెట్టి టైటిల్ ని మరింత ఆసక్తికరంగా క్యాచీగా మార్చారు. ఇక ఈ వీడియోలో విష్ణు ఇంట్లో తీరిగ్గా కూర్చుని సునీల్ తో ఫోన్ లో మాట్లాడుతుంటాడు. నెక్స్ట్ మూవీ ఎవరితో అయితే బావుంటుంది అని సునీల్ ని సలహా అడుగుతాడు. నీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ ఢీ, దేనికైనా రెడీ.. ఆ చిత్రాలకు కథలు అందించింది కోన వెంకట్. ఆయన్నే అడుగు అని అంటదు సునీల్. దీనితో విష్ణు ఫోన్ చేయగానే కోన వెంకట్ ప్రత్యక్షం అవుతారు. 

 ఏం తమ్ముడు ఎందుకు పిలిచావ్ అని కోన అడుగుతారు. సినిమా చేయాలి అని విష్ణు అనగా.. ఇప్పుడు నువ్వు మా ప్రెసిడెంట్ కదా.. నువ్వు సినిమా చేయడం ఏంటి అని ఫన్నీగా కోన వెంకట్ ప్రశ్నిస్తారు. అదేంటి నేను మా ప్రెసిడెంట్ మాత్రమే ఇండియా ప్రెసిడెంట్ కాదు అంటూ విష్ణు తనపై తానె సెటైర్ వేసుకుంటాడు. మా ప్రెసిడెంట్ సినిమాలు చేయకూడదు అని రాజ్యంగంలో ఉందా అని విష్ణు ప్రశ్నిస్తాడు. 

దీనితో కోన కథ చెప్పడం, చోటా కె నాయుడు, దర్శకుడిగా ఇషాన్ సూర్య, సంగీత దర్శకుడిగా అనూప్ రూబెన్స్ ని ఎంపిక చేసుకొవడం చకచకా జరిగిపోతుంది. ఇక ఈ చిత్రానికి టైటిల్ ఏమైతే బావుంటుంది అని అడగగా.. కోనవెంకట్ 'జిన్నా' అని సమాధానం ఇస్తారు. దీనితో విష్ణు జిన్నా ఏంటండీ.. పాకిస్తాన్, మహమ్మద్ అలీ జిన్నా గుర్తుకు వస్తున్నాయి. కాంట్రవర్సీ అవుతుందేమో అంటాడు. 

దీనికి కోన వెంకట్ బదులిస్తూ.. మనకథలో హీరో పేరు గాలి నాగేశ్వర రావు. అతడి పేరు అతడికే నచ్చదు. దీనితో జి.నాగేశ్వర రావుని 'జిన్నా'గా షార్ట్ ఫామ్ లోకి మార్చేస్తాడు. దీనితో విష్ణు టైటిల్ అదిరిపోయింది అంటాడు. వెంటనే టైటిల్ లోగో పడుతుంది. 

YouTube video player