ప్రభాస్ బర్త్ డే.. మంచు విష్ణు 'కన్నప్ప' నుంచి స్పెషల్ పోస్టర్

హీరో మంచు విష్ణు ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా చిన్న సర్ప్రైజ్ ఇచ్చాడు. ప్రభాస్ ఫ్యాన్స్ ని థ్రిల్ చేస్తూ పోస్టర్ రూపంలో బర్త్ డే విషెస్ తెలిపారు.

manchu vishnu kannappa team wishes prabhas on his birthday dtr

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయికి చేరుకునే ప్రయత్నాలో ఉన్నాడు. ఆరడుగుల కటౌట్ తో ప్రభాస్ సిల్వర్ స్క్రీన్ పై కనిపించే అభిమానుల్లో ఉప్పొంగే ఎనర్జీ లెవెల్స్ వేరుగా ఉంటాయి. టాలీవుడ్ లో బాలీవుడ్ స్టార్స్ కి ధీటుగా పోటీ పడడం ప్రభాస్ కే సాధ్యమైంది. ప్రస్తుతం ప్రభాస్ సలార్, కల్కి 2898 చిత్రాల్లో నటిస్తున్నాడు. ఈ చిత్రాలతో ప్రభాస్ హాలీవుడ్ స్థాయిలో గుర్తింపు దక్కించుకోవడం ఖాయం అంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 

ముఖ్యంగా కల్కి చిత్రంతో తెలుగు సినిమా స్టాండర్ట్స్ ఇంటర్నేషనల్ స్థాయిని అందుకుంటాయి అని అంటున్నారు. ఇటీవల విడుదలైన కల్కి టీజర్ ఆ రేంజ్ లోనే పేలింది. ఇదిలా ఉండగా ప్రభాస్ నేడు తన 44వ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ప్రభాస్ కి బర్త్ డే విషెస్ తో హోరెత్తిస్తున్నారు. 

హీరో మంచు విష్ణు ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా చిన్న సర్ప్రైజ్ ఇచ్చాడు. ప్రభాస్ ఫ్యాన్స్ ని థ్రిల్ చేస్తూ పోస్టర్ రూపంలో బర్త్ డే విషెస్ తెలిపారు. కన్నప్ప చిత్ర యూనిట్ ప్రభాస్ కి బర్త్ డే విషెస్ చెబుతూ క్రేజీ పోస్టర్ డిజైన్ చేశారు. ఈ పోస్టర్ లో ప్రభాస్ వివిధ రకాల ఫొటోలతో పాటు బర్త్ డే విషెస్ నోట్ కూడా ఉంది. 

'ప్రభంజనమై ప్రేక్షకుల హృదయాల్ని మనసుతో, వ్యక్తిత్వంతో , నటనతో గెలుచుకుని.. ప్రపంచమంతా శభాష్ అనిపించుకుంటున్న మా ప్రభాస్ కి జన్మదిన శుభాకాంక్షలు.. టీం కన్నప్ప' అని విష్ చేశారు. మంచు విష్ణు ఈ పోస్టర్ ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. 

మంచు విష్ణు.. శివభక్తుడు కన్నప్ప కథని దృశ్య కావ్యంలా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. మంచువారి సొంత నిర్మాణంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రంలో ప్రభాస్ శివుడు పాత్రలో నటిస్తారు అంటూ ప్రచారం జరిగింది. కాని అవన్నీ ఊహాగానాలే. శివుని పాత్రలో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ నటిస్తున్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios