సినిమా ప్రమోషన్స్ కోసం చిత్ర యూనిట్ అనేక మార్గాలు వెతుకుతూ ఉంటారు. మంచు విష్ణు తన కొత్త మూవీ ప్రమోషన్స్ వెరైటీగా స్టార్ట్ చేశారు . ఆయన హీరోయిన్ సన్నీ లియోన్ తో కలిసి చేసిన వీడియో వైరల్ గా మారింది.

టాలీవుడ్‌ హీరో మంచు విష్ణు శివబాలాజీ బాలీవుడ్‌ స్టార్‌ సన్నీ లీయోన్‌(Sunny Leone)తో కలిసి ఒక గేమ్‌ ఆడారు. ఒకరి తరువాత ఫన్నీ గేమ్‌ ఆడుతూ సందడి చేశారు. దీనికి సంబంధించిన వీడియోను సన్నీ ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. బాల్యంలో ఆడుకున్న ఆట గుర్తొచ్చిందంటూ కొందరు కమెంట్‌ చేయగా, మరింత ఫన్నీగా, మరికొందరు స్పందించారు.సన్నీ, మంచు విష్ణును భయపెట్టేందుకు ప్రయత్నించిన వీడియో ఇటీవల నెట్టింట హల్‌ చల్‌ చేసింది. 

కాగా విష్ణు (Manchu Vishnu) తాజా చిత్రం గాలి నాగేశ్వరరావులో సన్నీ లియోన్‌ కీలక పాత్ర పోషిస్టున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్‌ జరుపు కుంటోంది. ఈ క్రమంలో షూటింగ్‌ బ్రేక్‌లో సన్నీ, విష్ణు, బాలాజీ ఈ ఫన్నీ వీడియోతో సందడి చేశారు.గతంలో సన్నీ లియోన్ మంచు మనోజ్ హీరోగా నటించిన కరెంటు తీగ మూవీలో నటించారు. ఆ మూవీలో ఆమె స్కూల్ టీచర్ రోల్ చేశారు. మరోసారి మంచు హీరోలు సన్నీ లియోన్ ని టాలీవుడ్ ప్రేక్షకుల కోసం ఆమెను దిగుమతి చేసుకున్నారు. 

Scroll to load tweet…

ఇక మంచు ఫ్యామిలీ నుండి ఏ సినిమా వచ్చినా కనీస ఆదరణ దక్కడం లేదు. మోహన్ బాబు చాలా గ్యాప్ తర్వాత సన్ ఆఫ్ ఇండియా చిత్రంతో ప్రేక్షకులను పలకరించారు. డిజాస్టర్స్ ఖాతాలో చేరిన ఈ మూవీకి కనీసం లక్షల్లో కూడా వసూళ్లు రాబట్టలేకపోయింది. పోస్టర్స్, మైదా ఖర్చులు కూడా రాబట్టలేక పోయిన సన్ ఆఫ్ ఇండియా చిత్రం మోహన్ బాబుకు తీవ్ర నష్టాలు మిగిల్చింది. అలాగే మంచు విష్ణు చివరి చిత్రం మోసగాళ్లు పరిస్థితి కూడా ఇదే. కాజల్ అగర్వాల్, సునీల్ శెట్టి వంటి స్టార్ కాస్ట్ తో భారీ బడ్జెట్ తో మోసగాళ్లు చిత్రం తెరకెక్కించారు. ఈ మూవీ కూడా మంచు ఫ్యామిలీని నష్టాల్లోకి నెట్టింది. ఈసారి ఆయన కామెడీ ఎంటర్టైనర్ నమ్ముకొని బరిలోకి దిగుతున్నారు. గాలి నాగేశ్వరరావు ఏమాత్రం విజయం సాధిస్తుందో చూడాలి.