టాలీవుడ్ లో చాలా మంది హీరోలు సిక్స్ ప్యాక్ లుక్ ట్రై చేశారు. అల్లు అర్జున్, రానా, రాంచరణ్, రామ్ లాంటి హీరోలు ఇప్పటికే సిక్స్ ప్యాక్ లుక్ లో మెప్పించిన సంగతి తెలిసిందే. ఇటీవల నవదీప్ తన సిక్స్ ప్యాక్ లుక్ లో సోషల్ మీడియాలో షేర్ చేసి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తాడు. 

నవదీప్ కొత్త అవతారం చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. కళ్ళు చెదిరేలా నవదీప్ సిక్స్ ప్యాక్ బాడీ ఉండడంతో సెలెబ్రిటీలు సైతం ఫిదా అవుతున్నారు. తాజాగా హీరో మంచు విష్ణు నవదీప్ పై పరోక్షంగా సరదా వ్యాఖ్యలు చేశాడు. నవదీప్ అంటే అసహ్యం అంటూనే అతడిపై ప్రశంసలు కురిపించాడు. 

నవదీప్ నాకు ఎప్పుడూ నచ్చేవాడు కాదు. ఈ ఫోటో చూసిన తర్వాత(నవదీప్ సిక్స్ ఫ్యాన్ బాడీని ఉద్దేశిస్తూ) అతడిని అసహ్యించుకోవడానికి మరో కారణం దొరికింది. ఇది ఫోటోషాప్ చేసిన లుక్ అని మంచు విష్ణు నవదీప్ ని పరోక్షంగా ప్రశంసించాడు. 

నవదీప్ ఈ లుక్ కోసం గత 6 నెలల నుంచి కష్టపడుతున్నట్లు తెలుస్తోంది. తాను ఇలా సిక్స్ ప్యాక్ లుక్ లోకి మారడానికి అల్లు అర్జున్, రామ్ చరణ్, రానా ఇన్స్పిరేషన్ అని నవదీప్ తెలిపాడు. నవదీప్ ఈ సిక్స్ ప్యాక్ లుక్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ చిత్రం కోసం అంటూ వార్తలు వస్తున్నాయి.