ఉపముఖ్యమంత్రి భట్టితో మంచు విష్ణు టీమ్ భేటీ.. కారణం ఇదే..?

తెలంగాణాలో ప్రభుత్వం ఏర్పడిన తరువాత చాలా రోజులకు సినిమా ఇండస్ట్రీ వాళ్ల నుంచి స్పందన వస్తుంది. ఈమధ్య ఇండస్ట్రీ వాళ్ళు.. ప్రభుత్వ పెద్దలను వరుసగా కలుస్తున్నారు. 
 

Manchu Vishnu and Maa Team Meets Telangana Deputy Cm Bhatti Vikramarka JMS

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు దాటింది. కాని పూర్తి స్థాయిలోసినిమా ఇండస్ట్రీపెద్దలు ప్రభుత్వ పెద్దలతో కలిసింది లేదు. ఎవరికి వారు విడిగా వచ్చి కలుస్తూనే ఉన్నారు. కాని పూర్తి స్థాయిలో ఇండస్ట్రీ టీమ్ కొత్త ప్రభుత్వంతో కలవలేదు. ఈక్రమంలో రీసెంట్ గా నందీ అవార్డులను గద్దర్ అవార్డ్ లుగా మార్చి.. అనౌన్స్ చేశారు రేవంత్ రెడ్డి. ఇక త్వరలో సినిమా ఇండస్ట్రీలో భారీ స్థాయి మీటింగ్ ఉండే అవకాశం ఉన్నట్టుతెలుస్తోంది. ఈక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ తో పాటు.. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ను కూడా  టాలీవుడ్ ప్ర‌ముఖులు వరుసగా కలుస్తున్నారు. 

తాజాగా తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లుభట్టి విక్రమార్కను  న‌టుడు, మా అధ్యక్షుడు మంచు విష్ణు తో పాటు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఆదివారం ఉద‌యం హైదరాబాద్‌లోని ప్ర‌జా భ‌వ‌న్ లో వీరి భేటీ జరిగింది. ఉదయం ప్రజా భవన్ కు వెళ్లిన మంచు విష్ణు భట్టి విక్రమార్క కు పుష్పగుచ్ఛం అందించారు.  తెలంగాణ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఆయ‌న‌కు శుభాకాంక్షలు తెలిపారు.

 

ఇక ఈ భేటీలో పర్సనల్ విషయాలతో పాటు.. ఇండస్ట్రీకి సబంధించి విషయాలు కూడా చర్చించినట్టు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా  తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించిన పలు సమస్యలు గురించి వీరు  చర్చించారు. అనంత‌రం భట్టిని మంచు విష్ణు సన్మానించారు. ఇక ఈ భేటీలో మంచు విష్ణుతో పాటు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులు నటులు రఘుబాబు, శివ బాలాజీ కూడా పాల్గొన్నారు. కాగా ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios