హైదరాబాద్ లోని బర్కత్‌పురాలో ఇంటర్ చదువుతోన్న మధులిక అనే విద్యార్ధినిపై సత్యనగర్ కి చెందిన భరత్ అనే యువకుడు దాడి చేశాడు. తనను ప్రేమించడం లేదనే కోపంతో అత్యంత దారుణంగా ఆమెపై కత్తితో దాడికి పాల్పడ్డాడు.

ఆమె మెడ వెనుక భాగం, పొట్ట, చేతికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషయంపై స్పందించిన మంచు మనోజ్ ట్విట్టర్ లో ఎమోషనల్ గా పోస్ట్ పెట్టాడు. ఆడపిల్లపై దాడి చేయడంపై  ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మానవత్వం లేని మగాడు పుట్టడం దేనికి..? అంటూ ప్రశ్నించాడు.

మనిషి అనేవాడు ఒక ఆడపిల్ల మీద దాడి చేసే ముందు వాళ్ల ఇంట్లో ఉన్న ఆడవాళ్లను తలుచుకుంటే ఇలాంటి ఏనాడు జరగవని అన్నారు. ఆడపిల్లల్ని రక్షించాల్సిన మగాడు ఆడపిల్ల అనుభవించే నరకానికి కారకుడైతే ఇక మనం పుట్టిన దానికి అర్ధం ఏంటి..? అంటూ తన ట్వీట్ లో పేర్కొన్నాడు. ప్రేమోన్మాది భరత్ ని పోలీసులు అదుపులో తీసుకున్నారు.