మంచు మనోజ్ రెండో వివాహం చేసుకోనున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన స్పందించారు. సోషల్ మీడియా వేదికగా తనదైన శైలిలో సమాధానం చెప్పారు. గత వారం రోజులుగా అన్ని ప్రధాన మాద్యమాలలో మనోజ్ పెళ్లి వార్త ప్రముఖంగా వినిపిస్తుంది. మనోజ్ రెండో పెళ్ళికి సర్వం సిద్ధం, అమ్మాయి కూడా రెడీ అంటూ వరుస కథనాలు వెలువడడం జరిగింది. 

మంచు మనోజ్ 2015లో ప్రణతి రెడ్డిని ప్రేమ వివాహం చేసుకున్నారు. పెద్దల సమక్షంలో గ్రాండ్ గా వీరి వివాహం జరిగింది. కారణం ఏమైనా కానీ 2019లో వీరిద్దరూ విడాకులు తీసుకొని విడిపోయారు. పరస్పర అవగాహనతో విడాకులు తీసుకొని విడిపోతున్నట్లు మంచు మనోజ్ సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ కి తెలియజేశారు. కెరీర్ పరంగా కూడా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న మనోజ్ జీవితంలో విడాకులు, కుదుపుకు గురిచేశాయి. 

అప్పటి నుండి ఒంటరిగా ఉంటున్న మనోజ్ అహం బ్రహ్మస్మి అనే భారీ పాన్ ఇండియా చిత్రాన్ని ప్రకటించారు. తాజాగా మనోజ్ రెండో వివాహం చేసుకోనున్నాడని వార్తలు వస్తున్నాయి. సదరు వార్తలపై సెటైరికల్ గా స్పందించాడు మంచు మనోజ్. 'డేట్ టైం కూడా మీరే చెప్పేయండి' అంటూ బ్రహ్మానందం మీమ్ పంచుకున్నాడు. అయితే రెండో పెళ్లిని మనోజ్ ఖండించాడో, సమర్ధించాడో మాత్రం అర్థం కాలేదు.