సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మంచు మనోజ్ ని ఓ నెటిజన్ 'క్యాస్టియెస్ట్ ఇడియట్' అని తిట్టడం వైరల్ అయింది. తన వ్యక్తిగత విషయాలతో పాటు రాజకీయాలకు సంబంధించిన విషయాలపై ట్విట్టర్ వేదికగా స్పందిస్తోన్న మంచు మనోజ్.. ఇటీవల ఆంధ్రప్రదేశ్ కి జరిగిన అన్యాయం మీద మోదీని ప్రశ్నిస్తూ ట్వీట్ పెట్టిన సంగతి తెలిసిందే. 

తాజాగా మోదీ ఏపీలో పర్యటిస్తోన్న నేపధ్యంలో మనోజ్ మరోసారి ట్విట్టర్ వేదికగా.. 'మీరు ఎన్నికల ప్రచారం కోసం ఏపీకి వస్తున్నారా..? ఇక్కడి జనాల సమస్యలు చూడడానికి వస్తున్నారా..?' అంటూ ట్వీట్ చేశాడు.

దీనిపై ఓ నెటిజన్ స్పందిస్తూ.. 'ముందు కేంద్రం ఇచ్చిన ఐదు లక్షల కోట్లను ఎలా ఖర్చు పెట్టాడో నారా చంద్రబాబు నాయుడిని అడుగు. అంత దమ్ము ఉందా.. 'క్యాస్టియెస్ట్ ఇడియట్'' అంటూ తిట్టాడు. ఇది చూసిన మనోజ్.. 'పేరు చివర క్యాస్ట్ పెట్టుకున్నది నువ్వా నేనా.. మరి క్యాస్టియెస్ట్ ఇడియట్ ఎవరు అన్నా..? ఐ యామ్ నిలదీస్ఫైయింగ్ యు.. కూల్ బ్రదర్' అంటూ ట్వీట్ చేశాడు.

తనను కుల పిచ్చి వెధవ అంటూ సదరు నెటిజన్ తిట్టినప్పటికీ మంచు మనోజ్ మాత్రం తన సహనం  కోల్పోకుండా జవాబు ఇవ్వడం నెటిజన్లను ఆకర్షిస్తోంది.