గతంలో మహిళలపై అత్యాచారం చేశారంటూ ఆరోపణలు ఎదుర్కొన్న నిత్యానంద అందరికీ గుర్తుండే ఉంటారు. పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేయడం, ఆ తరువాత ఆయన బయటకి వచ్చేసి ఎప్పటిలానే తన స్వామి అవతారంలో దర్శనమివ్వడం జరిగిపోయాయి.

తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. జంతువులతో కూడా తమిళం, సంస్కృతం మాట్లాడించగలనని ఆయన చెప్పిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ''కోతులతో పాటు మరికొన్ని జంతువులకు ఇంటర్నల్ ఆర్గాన్స్ లేవు. సూపర్ కాన్సియోస్ పద్ధతి ద్వారా పురోగతిని అందిస్తే వాటిల్లో ఆయా అవయవాలు వృద్ధి చెందుతాయి. శాస్త్రీయ, వైద్య విధానాల్లో ఇది చేసి చూపిస్తాను. ఇది గనుక పూర్తి స్థాయిలో అభివృద్ధి జరిగితే ఆవులు, ఎద్దులు సంస్కృతం, తమిళం మాట్లాడతాయి'' అంటూ చెప్పుకొచ్చారు.
దీనిపై స్పందించిన మంచు మనోజ్.. ''వామ్మో ఎవరైనా ఈ స్వామికి చెప్పండి ప్లీజ్.. డాక్టర్ అబ్దుల్ కలాం గారు ఇవి చూడలేకే స్వర్గానికి వెళ్ళిపోయుంటారనుకుంటా.. స్వామీ మీరు చాలా క్యూట్'' అని ట్వీట్ చేశారు.